Asianet News TeluguAsianet News Telugu

ఫెడరల్ ఫ్రంట్ పై జగన్ తో కేసీఆర్ భేటీ ఆ తర్వాతే...

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గతంలో ఓసారి జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. జగన్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇస్తారని కెసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, కేసీఆర్, జగన్ మధ్య ఇప్పటి వరకు భేటీ జరగలేదు. 

KCR likely to meet YS Jagan after elections are over
Author
Hyderabad, First Published May 15, 2019, 7:47 AM IST

హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఆయన తుది విడత పోలింగ్ ముగిసిన తర్వాత, అంటే ఈ నెల 19వ తేదీ తర్వాత జగన్ ను కలుస్తారని అంటున్నారు. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గతంలో ఓసారి జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. జగన్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇస్తారని కెసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, కేసీఆర్, జగన్ మధ్య ఇప్పటి వరకు భేటీ జరగలేదు. 

ప్రాంతీయ పార్టీలతో కలిపి ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. తన ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తో భేటీ అయ్యారు. డిఎంకె నేత స్టాలిన్ తో కూడా ఆయన సమావేశమయ్యారు. 

బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమిగా ప్రాంతీయ పార్టీలు ఏర్పడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగాలనే తన ఆలోచనలో భాగంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు రూపకల్పన చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు దానికి ఓ రూపం రాలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios