Asianet News TeluguAsianet News Telugu

పాత చీరలను ఇలా కూడా వాడొచ్చు తెలుసా?

ఆడవాళ్లలకు ఎన్ని చీరలను కొన్నా సరిపోవు. ఇంకా ఇంకా కొంటూనే ఉంటారు. నచ్చిన రంగు, నచ్చిన ఫ్యాబ్రిక్ ఉంటే చాలు ఇష్టమున్నన్ని చీరలను కొంటూ ఉంటారు. వీళ్లు కొనడానికి కబ్బోర్డులు కూడా ఖాళీగా ఉండవు. అయితే చాలా మందికి పాత చీరలను ఏం చేయాలో తోచదు. ఇంకేముందు అమాంతం వాటిని మూటగట్టి పారేస్తుంటారు. కానీ పాతచీరలతో సరికొత్తగా డిజైన్ చేసి వాడొచ్చు తెలుసా? 
 

Best Ideas To Make Dresses From Old Sarees? rsl
Author
First Published Dec 9, 2023, 11:33 AM IST

ప్రతి ఒక్కరూ అందంగా, ఆకర్షణీయంగా, అందరిలో మరింత బ్యూటీఫుల్ గా కనిపించాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. అందుకే ఆడవాళ్లు బట్టల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. ఎన్ని చీరలను కొన్నా..నచ్చిన చీర కనిపిస్తే చాలు వెంటనే కొనేస్తుంటారు. నెలకు రెండు మూడు చీరలను కొనే వారు కూడా ఉన్నారు. నిజానికి చీర ఆడవాళ్ల అందాన్ని మరింత పెంచుతుంది. అందుకే ప్రతి ఇండియన్ మహిళ వార్డ్ రోబ్ పూర్తిగా చీరలతో నిండిపోయి ఉంటుంది. ఈ చీరల్లో కొన్ని రెగ్యులర్ వి ఉంటే.. మరికొన్ని పండుగలు, ఫంక్షన్లకు కట్టుకెళ్లేవి ఉంటాయి. అయితే కొన్ని చీరలను కొంటారు కానీ.. వాటిని వాడే సందర్భం మాత్రం రాదు. ఎందుకంటే ఎప్పుడో కొన్ని చీరల కలర్ కానీ, వాటి డిజైన్స్ కానీ నచ్చకపోవచ్చు. ఇలాంటి చీరలనే ఆడవాళ్లు ఏండ్ల తరబడి బీరువాల్లో పెడుతారు. లేదా ఎవరికైనా ఇస్తుంటారు. 

అయితే మీ దగ్గర కూడా ఇలాంటి చీరలే ఉంటే పండగ  సీజన్ లో వాటిని డిఫరెంట్ గా స్టిచ్ చేసి వాడొచ్చు. పాత చీరలను కొత్తగా ఎలా డిజైన్ చేసి వాడొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

డ్రెస్ లు: మీ దగ్గర బోలెడు పాత చీరలు ఉంటే.. వాటిని ఎంచక్కా డ్రెస్ కుట్టుకుని వాడొచ్చు. ఈ చీరలను ఉపయోగించి మీకు నచ్చిన స్టైల్ లో అంటే ఎలైన్ లేదా స్ట్రెయిట్, అనార్కలీ సూట్లను కుట్టుకుని వేసుకోవచ్చు. వీటిని కాంచీపురం, సిల్క్ లేదా బెనారసి చీరతో కుట్టుకుని వేసుకుంటే మీరు అందంగా కనిపిస్తారు. మీరు కాకపోయినా మీ పిల్లలకు కూడా కుట్టించొచ్చు. 

దుప్పటా: మీ దగ్గగర చిఫాన్ లేదా జార్జెట్ పాత చీరలు ఉన్నాయా? వాటిని యూజ్ చేయడం లేదా? అయితే వీటితో ఎంచక్కా దుప్పటా ను కట్ చేసి వాడండి. లేదా ఈ చీరలతో షరారాను డిజైన్ చేయించి వాడండి. వీటిలో మీరు మరింత అందంగా కనిపిస్తారు. 

కుషన్ కవర్:  మీ దగ్గర అందమైన బనారసి చీరలు ఉన్నాయా? ఇంకెందుకు ఆలస్యం.. వాటి బార్డర్ లను కట్ చేసి పక్కన పెట్టి వేటికైనా యూజ్ చేయండి. మిగిలిన చీరను స్కార్ఫ్ లు, క్లాత్ బ్యాగులను తయారుచేయండి. అలాగే మీరు వీటిని కుషన్ కవర్లుగా కూడా ఉపయోగించొచ్చు. 

ఫ్లేర్డ్ స్కర్ట్: మీ దగ్గర చందేరి సిల్క్ లేదా బ్రోకేడ్ చీరలు ఉన్నాయా. అయితే మీరు వీటితో ఫ్లేర్డ్ స్కర్ట్ ను డిజైన్ చేయండి. ఇది మీకు ఇండో వెస్ట్రన్ లుక్ ను ఇస్తుంది. దీనిపై మీరు ఫార్మల్ షర్ట్ లేదా సాదా టాప్ ను వేసుకోవచ్చు. దీనిలో కూడా మీరు బ్యూటీఫుల్ గా కనిపిస్తారు. 

టునిక్ అండ్ టాప్: పొడవైన చీర అంటే 6 మీటర్లున్న చీరతో మీరు చాలా ఈజీగా టూనిక్ లేదా టాప్ ను డిజైన్ చేసుకోవచ్చు. మీ దగ్గర బాటిక్ లేదా బ్లాక్ ప్రింట్ చీర ఉంటే టాప్ లేదా షార్ట్ కుర్తీని కుట్టించుకుని వాడండి. దీన్ని లెగ్గింగ్ లేదా జీన్స్ పైకి వాడండి. అందంగా కనిపిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios