Asianet News TeluguAsianet News Telugu

10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.21వేల జీతం.. అప్లయ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 25,271 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో  మహిళలకు 2847 పోస్టులు కేటాయించారు.
 

ssc gd constable jobs 2021 notification released apply online for 25271 gd constable jobs before august 31 at ssc.nic.in
Author
Hyderabad, First Published Aug 10, 2021, 6:21 PM IST

ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు  గుడ్‌న్యూస్‌. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 25,271 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో  మహిళలకు 2847 పోస్టులు కేటాయించారు.

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్‌ఎస్‌ఎసీ‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందన్న విషయం తెలిసిందే. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ లో చూడవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 25, 271 ఇందులో బి‌ఎస్‌ఎఫ్ - 7545, సి‌ఐ‌ఎస్‌ఎఫ్  - 8464, ఎస్‌ఎస్‌బి - 3806, ఐ‌టి‌బి‌పి - 1431, ఏ‌ఆర్- 3785, ఎస్‌ఎస్‌ఎఫ్ - 240 ఉన్నాయి.

అర్హత: 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100, మహిళలు, ఎస్‌సి, ఎస్‌టి, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

also read డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలకు రూ.29వేల జీతం.. వెంటనే అప్లయి చేసుకోండీ..

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (Online Written Examination), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Standards Test)‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష (Physical Efficiency Test and Medical Examination)ల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

 ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి. పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

దరఖాస్తులు ప్రారంభం: 17 జులై  2021

దరఖాస్తులకు చివరితేది: 31 ఆగస్టు 2021

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 2 సెప్టెంబర్‌  2021

సీబీటీ పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు.

అధికారిక వెబ్‌సైట్‌:https://ssc.nic.in/

Follow Us:
Download App:
  • android
  • ios