Asianet News TeluguAsianet News Telugu

IARI Recruitment 2022: 641 పోస్టుల దరఖాస్తు గడువు పెంపు.. వివ‌రాలివే..!

ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టెక్నీషియన్ పోస్టుల కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీని పొడగించింది. టెన్త్ పాస్ అయినవారికి అలర్ట్. టెన్త్ అర్హతతో భర్తీ చేస్తున్న 641 ఉద్యోగాలకు అప్లై చేయడానికి మరో ఆరు రోజులు గడువుంది. 

Extension of last date for Applications
Author
Hyderabad, First Published Jan 14, 2022, 3:51 PM IST

ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టెక్నీషియన్ పోస్టుల కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీని పొడగించింది. టెన్త్ పాస్ అయినవారికి అలర్ట్. టెన్త్ అర్హతతో భర్తీ చేస్తున్న 641 ఉద్యోగాలకు అప్లై చేయడానికి మరో ఆరు రోజులు గడువుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు (ICAR) చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) జాబ్ నోటిఫికేషన్ ద్వారా 641 టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పోస్టులకు గత నెలలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2022 జనవరి 10 చివరి తేదీ అని ముందుగానే నోటిఫికేషన్‌లో వెల్లడించింది IARI. ఈ గడువు ముగియడంతో అప్లికేషన్ డెడ్‌లైన్‌ను పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 జనవరి 20 లోగా దరఖాస్తు చేయొచ్చు.


దరఖాస్తు ప్రారంభం: 2021 డిసెంబర్ 18
దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 20 రాత్రి 11.45 గంటల వరకు
పరీక్ష తేదీ: 2022 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5
విద్యార్హతలు: టెన్త్‌ క్లాస్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి
వయస్సు: 2022 జనవరి 10 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.700 ఎగ్జామ్ ఫీజు, రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
వేతనం: రూ.21,700 బేసిక్ వేతనంతో పాటు ఏడో పే కమిషన్ లెవెల్ 3 ఇండెక్స్ 1 అలవెన్సులు లభిస్తాయి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామ్
పరీక్షా విధానం- 100 ప్రశ్నలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
-వెబ్‌సైట్:https://iari.res.in/

Follow Us:
Download App:
  • android
  • ios