Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 5043 ఖాళీలు, డిగ్రీ చేసిన వారికి అవకాశం, జీతం రూ.1 లక్ష

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 5043 పోస్టులు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Central Government Jobs 5043 Vacancies in Food Corporation of India Opportunity for Graduates
Author
First Published Sep 5, 2022, 8:57 PM IST

Central Government Jobs: FCI లో 5043 పోస్టులకు గానూ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, FCI జూనియర్ ఇంజనీర్, షార్ట్‌హ్యాండ్ టైపిస్ట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఇన్ జనరల్, డిపో, అకౌంట్స్, టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 5043 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 05 అక్టోబర్ 2022లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

JE (సివిల్ ఇంజనీరింగ్)
ఖాళీల సంఖ్య : 48
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ. లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయస్సు అర్హత: 01.08.2022 నాటికి 28 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: రూ. 34,000- 1,03,400

JE (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్)
ఖాళీల సంఖ్య : 15
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ. లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయస్సు అర్హత: 01.08.2022 నాటికి 28 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: రూ. 34,000- 1,03,400

స్టెనోగ్రాఫర్ - II
ఖాళీల సంఖ్య : 73
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ. షార్ట్‌హ్యాండ్ టైపింగ్ తెలిసి ఉండాలి.
వయస్సు అర్హత: 25 సంవత్సరాల లోపు అభ్యర్థులు 01.08.2022 నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: రూ. 30,500- 88,100

అసిస్టెంట్ (జనరల్)
ఖాళీల సంఖ్య : 948
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
వయస్సు అర్హత: 01.08.2022 నాటికి 27 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: రూ. 28,200- 79,200

అసిస్టెంట్ (అకౌంట్స్)
ఖాళీల సంఖ్య : 406
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.com.
వయస్సు అర్హత: 01.08.2022 నాటికి 27 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: రూ. 28,200- 79,200

అసిస్టెంట్ (టెక్నికల్)
ఖాళీల సంఖ్య : 1406
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Sc. అగ్రికల్చర్‌లో లేదా బీఎస్సీ బోటనీ/ జువాలజీ/ బయో-టెక్నాలజీ/ బయో-కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్/ లేదా బీటెక్/ బీఈ ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో టెక్నాలజీలో చదివి ఉండాలి.
వయస్సు అర్హత: 01.08.2022 నాటికి 27 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: రూ. 28,200- 79,200

అసిస్టెంట్ (డిపో)
ఖాళీల సంఖ్య : 2054
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
వయస్సు అర్హత: 01.08.2022 నాటికి 27 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: రూ. 28,200- 79,200

అసిస్టెంట్ (హిందీ)
ఖాళీల సంఖ్య : 93
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీలో బ్యాచిలర్ డిగ్రీ.
వయస్సు అర్హత: 01.08.2022 నాటికి 28 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: రూ. 28,200- 79,200

వయోపరిమితి సడలింపు : SC/ST వర్గాలకు 5 సంవత్సరాలు మరియు OBC వర్గాలకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి : ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మీరు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 05.10.2022

దరఖాస్తు రుసుము : రూ. 500. కానీ SC / ST / PwBD / మహిళలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ ని సందర్శించండి.

Follow Us:
Download App:
  • android
  • ios