Asianet News TeluguAsianet News Telugu

ఆగష్టు 20 నుంచి హెచ్‌సీయూ ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం

కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ క్లాసెస్ ప్రారంభించడానికి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం వచ్చింది. అంతకుముందు హైదరాబాద్ విశ్వవిద్యాలయం  మార్చి 15 న అన్ని బ్యాచ్‌ల ఆన్ లైన్ తరగతులను నిలిపివేసింది. 

online classes for ongoing PG students of UOH to resume from August 20
Author
Hyderabad, First Published Aug 6, 2020, 6:19 PM IST

హైదరాబాద్: ఆగస్టు 20 నుంచి 2 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం కొనసాగుతున్న ఆన్‌లైన్ మోడ్‌ తరగతులను తిరిగి ప్రారంభించాలని హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యుఒహెచ్) నిర్ణయించింది.

కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ క్లాసెస్ ప్రారంభించడానికి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం వచ్చింది. అంతకుముందు హైదరాబాద్ విశ్వవిద్యాలయం  మార్చి 15 న అన్ని బ్యాచ్‌ల ఆన్ లైన్ తరగతులను నిలిపివేసింది.

సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & కమ్యూనికేషన్ మాజీ డీన్ వినోద్ పవరాలా నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ విద్యార్థులు, అధ్యాపక సభ్యులతో సహా సంబంధిత వారితో విస్తృతమైన సంప్రదింపులు జరిపి విద్యా కార్యకలాపాలు పున: ప్రారంభంపై ఇమెయిల్ ద్వారా అనేక సూచనలను అందుకుంది.

టాస్క్ ఫోర్స్ సిఫారసులను యుఓహెచ్ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పా రావు గురువారం పాఠశాలల హెడ్, డీన్లతో సమావేశమై చర్చించి ఆమోదించారు.

also read SSC JOBS : ఎస్‌ఎస్‌సి నోటిఫికేషన్ 2020 విడుదల.. మొత్తం 5846 కానిస్టేబుల్ పోస్టులు..

"కోవిడ్ -19 వ్యాప్తి కారణంగ క్యాంపస్‌లో ఫిజికల్, ఫేస్-టు-ఫేస్ తరగతులను నిర్వహించడం ద్వారా కలిగే ప్రజారోగ్య ప్రమాదాల గురించి అంచనాల ఆధారంగా, టాస్క్ ఫోర్స్ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్ క్లాసెస్ కొన్ని వారాల్లో ప్రారంభించాలని సిఫారసు చేసింది, ”అని హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలిపింది.

ప్రస్తుతం ఉన్న బిబిఎల్ (బోర్డింగ్ అలవెన్స్) స్కాలర్‌షిప్‌ను నెలకు రూ .1,000 రీ-పర్పస్ చేయాలన్న టాస్క్‌ఫోర్స్ సిఫారసును అంగీకరించినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. సైన్స్ స్కూల్స్  నుండి రీసెర్చ్ స్కాలర్స్  దశలవారీగా తిరిగి అనుమతించడానికి విశ్వవిద్యాలయం ఇంతకుముందు ఒక ప్రక్రియను ప్రారంభించింది, ప్రారంభంలో హైదరాబాద్‌లోని డే-స్కాలర్స్ మాత్రమే అనుమతిస్తుంది.

ఎం.ఫిల్, పిహెచ్‌డి విద్యార్థుల కోసం సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉంది, సైన్స్ స్కూల్స్ లాగానే ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది, తదుపరి నోటీసు వచ్చేవరకు వారు ఇళ్ల నుండే పని కొనసాగించాలని కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios