Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పూర్తయిన వారు ఇలా అప్లయ్ చేసుకోండీ..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునే వారికోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 300 పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 
 

bank jobs: union bank of india jobs 2021 notification out application process begins for 347 specialist officer posts apply at unionbankofindia co in
Author
Hyderabad, First Published Aug 16, 2021, 5:35 PM IST

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 300 పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు  చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 12న ప్రారంభం కాగా సెప్టెంబర్‌ 3 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.unionbankofindia.co.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.


మొత్తం ఖాళీలు: 347
సీనియర్ మేనేజర్ (రిస్క్)- 60
మేనేజర్ (రిస్క్)- 60
మేనేజర్ (సివిల్ ఇంజనీర్)- 7
మేనేజర్ (ఆర్కిటెక్ట్) - 7
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజర్) - 2
మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్) - 1
మేనేజర్ (ఫోరెక్స్‌) - 50
మేనేజర్ (ఛార్టెడ్ అకౌంటెంట్) - 14
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) - 26
అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్‌) - 120

also read 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.21వేల జీతం.. అప్లయ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి

 విద్యార్హతలు: పోస్టులను బట్టి వివిధ విద్యార్హతలు నిర్ణయించారు. అయితే గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు  అనుభవం తప్పనిసరి ఉండాలి.

వయసు: సీనియర్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకునే అభ్యర్థుల వయస్సు 30-40 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగాలకు 25-35 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 20-30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://www.unionbankofindia.co.in/ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12 ఆగస్టు 2021

దరఖాస్తులకు చివరి తేది: 3 సెప్టెంబర్‌  2021

అధికారిక వెబ్‌సైట్‌:https://www.unionbankofindia.co.in/

Follow Us:
Download App:
  • android
  • ios