తన తండ్రిని అలా చూడలేకపోయిన రాజమౌళి.. ఆ లెజెండ్ దగ్గరకి సాయం కోసం వెళితే..
పరాజయం ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన జీవితంలో కూడా కష్టాలు తప్పలేదు. రాజమౌళి సినిమాల్లోకి రాకముందు ఒక దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ లో ప్రముఖ రచయితగా ఉన్నారు.
పరాజయం ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన జీవితంలో కూడా కష్టాలు తప్పలేదు. రాజమౌళి సినిమాల్లోకి రాకముందు ఒక దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ లో ప్రముఖ రచయితగా ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్ రచయితగా పనిచేసారు.
అయితే ఒక సమయంలో తన సొంత నిర్మాణంలో అర్థాంగి అనే చిత్రాన్ని తెరకెక్కించడం వల్ల బాగా నష్టపోయారు. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఆస్తులన్నీ పోయాయట. పూట గడవడం కూడా కష్టం అయిపోయిందట. డైరెక్టర్ గా ఫెయిల్ కావడంతో రచయితగా కూడా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదట.
దీనితో విజయేంద్ర ప్రసాద్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. తన తండ్రిని అలా చూడలేకపోయారట రాజమౌళి. తండ్రి కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే రాజమౌళి కుటుంబంలో లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతా రామశాస్త్రికి మంచి అనుబంధం ఉంది.
Rajamouli
వెంటనే రాజమౌళి సిరివెన్నలకి ఫోన్ చేసి ఓ సాయం కావాలని అడిగారట. తన కుటుంబ సభ్యుల లాగే సిరివెన్నెల కూడా రాజమౌళిని నంది అని పిలుస్తారట. సిరివెన్నెల ఆ రా నంది.. ఏం సాయం కావాలి అని అడిగారు. అక్కడకు వచ్చి చెబుతాను అని రాజమౌళి వెళ్లి కలిసాడు.
Sirivennela Seetharama Sastry
ఓ పుస్తకం తీసుకుని ఇందులో 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి' అనే పాట రాసివ్వమని అడిగారట. ఆ పాట పట్టుదల చిత్రంలోనిది. రాజమౌళికి ఆ పాట ఇన్సిపిరేషన్ అట. రాజమౌళి అడిగాడు కాబట్టి సిరివెన్నెల చాలా స్లోగా బాగా అర్థం అయ్యేలా పాటని రాసిచ్చారట.
అసలు ఎందుకు ఈ పాట అని అడిగితే మా నాన్నగారికి ఇవ్వాలి అని రాజమౌళి అన్నారు సిరివెన్నలతో. ఆ పాటని రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ కి ఇచ్చారు. ఆ పాట చదివిన వెంటనే విజయంద్ర ప్రసాద్ లో మళ్ళీ కసి పెరిగింది. డీలా పడిపోకూడదు. ఫైట్ చేయాలి. మంచి సినిమాలు రాయాలి అని ఉత్తేజం పొందారట. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు ఇచ్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకున్నట్లు రాజమౌళి తెలిపారు.
సిరివెన్నెల చివరగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని దోస్తీ అనే పాటని రాశారు. ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆంతకు ముందు కూడా సింహాద్రి లాంటి రాజమౌళి చిత్రాలకు సిరివెన్నెల పాటలు రాశారు.