బికినీలో మెరిసిన మెహ్రీన్.. గ్లామరస్ పిక్స్ వైరల్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ.
మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా మెప్పించింది.
ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 పర్వాలేదనిపించింది. బిగ్ సక్సెస్ అయితే సాధించలేకపోయింది. కొన్ని అసహజమైన సన్నివేశాలతో ఎఫ్ 3 చిత్రంపై విమర్శలు ఎదురయ్యాయి.
ఎఫ్ 3 తర్వాత మెహ్రీన్ కి ఎలాంటి తెలుగు ఆఫర్స్ లేవు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెహ్రీన్ యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.
తాజాగా మెహ్రీన్ గ్రీన్ బికినీలో మెరిసింది. మెహ్రీన్ తాజాగా ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెహ్రీన్ బికినీ పిక్స్ కి నెటిజన్లు లైకులతో స్పందన తెలియజేస్తున్నారు.
కొంతకాలం మెహ్రీన్ భవ్య బిష్ణోయ్ తో రిలేషన్ షిప్ కొనసాగించింది. 2021 మార్చి 12న వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కకుండానే విభేదాలతో విడిపోయారు.