Asianet News TeluguAsianet News Telugu

నందమూరి వారసుడుని లాంచ్ చేస్తున్న YVS చౌదరి ? ఎన్టీఆర్ సపోర్ట్?

ఈ  సంవత్సరంలో YVS చౌదరిమళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నట్టు గా సమాచారం.అందుకోసం నందమూరి వారసుడునే హీరోగా ఎంచుకున్నారు. 

YVS Chowdhary to introduce Nandamuri Janakiram son? jsp
Author
First Published Mar 26, 2024, 7:00 AM IST


కెరీర్ లో ఓ టైమ్ లో మంచి హిట్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడిగా వైవిఎస్‌. చౌద‌రి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఎన్.టి.ఆర్‌.కు వీరాభిమాని. అనేక సినిమాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆయ‌న కొత్త‌వారిని హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేశారు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు రావటం లేదు. అయితే తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అప్పట్లో వైవియస్ చౌదరి తీసిన లాహిరి లాహిరి లాహిరి లో, సీతయ్య లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. అదే ఊపులో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ని  ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఆయన చేసిన దేవదాస్ సినిమా కూడా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఆయన బాలయ్య తో తీసిన ఒక్క మగాడు సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ని అందుకుంది. అలాగే ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఆయన ప్రొడ్యూసర్ గా చేస్తునే డైరెక్షన్ కూడా చేసిన రేయ్ సినిమా భారీ ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీ కి దూరం అయ్యారు.ప్రస్తుతం ఆయన ఒక మంచి కథని రెడీ చేసే పనిలో ఉన్నట్టు గా తెలుస్తుంది. ఈ  సంవత్సరంలో ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నట్టు గా సమాచారం.అందుకోసం నందమూరి వారసుడునే హీరోగా ఎంచుకున్నారు. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ... స్వర్గీయ నందమూరి జానికి రామ్ కుమారుడుతో ఒక సినిమా  చేయబోతున్నట్టు గా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ స్టోరీ డిస్కషన్స్ లో  వైవిఎస్ చౌదరి బిజీ గా ఉంటున్నట్టు గా సమాచారం. అదొక ప్రేమ కథా చిత్రం అని, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పనులు ప్రారంభం అయ్యాయని చెప్తున్నారు. ఇది వైవియస్ చౌదరికి రీ లాంచింగ్ చిత్రం అని అంటున్నారు. జానికి రామ్ హరికృష్ణ పెద్ద కుమారుడు. ఆయన  రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో జానకిరామ్ మృతిచెందారు. ట్రాక్టర్‌ను తప్పించబోయి జానకిరామ్ కారు బోల్తాపడింది. 

అలాగే ఎన్టీఆర్ ఈ చిత్రం ప్రమోషన్స్ భాధ్యత తీసుకుంటానని చెప్పినట్లు వినిపిస్తోంది. తన అన్న జానికి రామ్ అంటే ఎన్టీఆర్ కు బాగా మమకారం. ఈ క్రమంలోనే తన అన్నకొడుకుకి సపోర్ట్ చేయటానికి ఎన్టీఆర్ ముందుకు వస్తున్నారట.  వై వి ఎస్ చౌదరి ఒక మంచి డైరెక్టర్ ఎమోషన్స్ ని బాగా హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ గా పేరు ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios