Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ #Spirit లో మరో బాలీవుడ్ స్టార్ హీరో?

. ‘స్పిరిట్‌’(Spirit) లో ప్రభాస్‌ తొలిసారి పోలీస్‌ పాత్రలో అలరించనున్నాడు.  

With Prabhas Spirit  Sandeep Reddy Vanga To Tie With Akshay kumar? jsp
Author
First Published Mar 25, 2024, 12:03 PM IST


పానిండియా లెక్కలు వచ్చాక అంతా మారిపోయింది. ఒక సినిమాలో ఒక హీరో సరిపోవటం లేదు. అన్ని భాషల నుంచి స్టార్స్ ని తీసుకొచ్చి నింపి అక్కడ మార్కెట్ ని కూడా కబ్జా చేసేయాల్సిన పరిస్దితి ఏర్పడింది. అదే ఇప్పుడు అందరు స్టార్ డైరక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్ ఫాలో అవుతున్నారు. ప్రభాస్ స్పిరిట్ చిత్రానికి కూడా అదే పద్దతి ఫాలో అవ్వాలనే సందీప్ వంగా ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...

యానిమల్ మూవీ తో పెద్ద హిట్ కొట్టి టాప్  డైరెక్టర్  అయ్యారు సందీప్ రెడ్డి వంగా. సందీప్ వంగా చేస్తున్న నెక్స్ట్ మూవీ స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   ఈ ఇయర్ ఎండ్ కి స్టార్ట్ అవుతుందని దర్శకుడు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ‘స్పిరిట్‌’(Spirit) లో ప్రభాస్‌ తొలిసారి పోలీస్‌ పాత్రలో అలరించనున్నాడు.  ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి మరో స్టార్ ని తీసుకొచ్చి అక్కడ కలెక్షన్స్ దుమ్ము రేపుదామనే ప్రయత్నంలో సందీప్ ఉన్నారంటున్నారు. ఆయనెవరు..

స్పిరిట్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని వినపడుతోంది. అయితే అక్షయ్ విలన్ గా నటిస్తున్నాడా? లేదా కీలక పాత్ర అని తెలియాల్సి ఉంది. సందీప్ ఇప్పటికే  అక్షయ్ కుమార్ కి కథ చెప్పాడని, అక్షయ్ కూడా కథ నచ్చి ఓకే చేసాడని అంటున్నారు.  ఈ వార్త కనుక  నిజమైతే మరొక బాలీవుడ్ హీరో తెలుగు కి పరిచయం అవుతున్నట్టే.   బాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు సౌత్  లో విలన్స్ గా ఓ వెలుగు వెలుగుతున్న నేపధ్యంలో అక్షయ్ ఎంట్రీ కూడా సరైన డెసిషనే. 
    
స్పిరిట్ మూవీ షూటింగ్ 2024లో ప్రారంభమై 2025 లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు.  స్పిరిట్ మూవీని టీసిరీస్  తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.    స్పిరిట్  చిత్రాన్ని  2025 క్రిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. సెప్టెంబరు 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని, ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ పూర్తి చేస్తానని తెలిపాడు. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయతీ, ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ప్రకటించాడు సందీప్.
 
నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ...‘‘  ‘స్పిరిట్‌’చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు 
   
                              ప్రభాస్ ప్రస్తుతం  అటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె', దర్శకుడు మారుతి తో మరో  చిత్రంలోనూ నటిస్తున్నారు.  అయితే, ప్రభాస్ ను పోలీస్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే 'స్పిరిట్' చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? ప్రభాస్ ను ఎప్పుడు ఖాకీ డ్రెస్ లో చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios