Asianet News TeluguAsianet News Telugu

`పెళ్లాం ఊరెళితే` ఫేమ్‌ నటి ప్రశాంతి హారతి రీఎంట్రీ ప్లాన్‌.. అలాంటి పాత్రలకు ఓకే అట..

ఒకప్పుడు కీలక పాత్రలతో అలరించింది నటి ప్రశాంతి హారతి. కానీ ఉన్నట్టుంది సినిమాలకు బ్రేక్‌ ప్రకటించి పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తానంటోంది. 
 

telugu actress prashanthi harathi re entry plan she is ready act to that roles arj
Author
First Published Mar 26, 2024, 11:23 PM IST

`పెళ్లాం ఊరెళితే`, `ఇంద్ర` వంటి సూపర్ హిట్ చిత్రాల్లో  కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నటి ప్రశాంతి హారతి. మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. అమెరికాలో ఉంటున్న ఆమె అక్కడ క్లాసికల్‌ డ్యాన్స్ నేర్పిస్తూ రాణిస్తున్నారు. కానీ నటనపై ఉన్న ప్యాషన్‌ ఆమెని మళ్లీ చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది ప్రశాంతి హారతి. ఆమె తాజాగా మంగళవారం మీడియాతో ముచ్చటించింది. 

ఈ సందర్భంగా నటి ప్రశాంతి హారతి మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వైజాగ్‌కి చెందిన ప్రశాంతి హారతి కూచిపూడి డాన్స్ నేర్చుకుంది. ఈ క్లాసికల్‌ డాన్స్ కోసం ఫోటో షూట్లు చేసినప్పుడు సినిమా ఆఫర్లు వచ్చాయట. కానీ ఇంట్లో వాళ్లకి సినిమాలంటే ఇష్టం లేదు. దీంతో ఆ వైపు ఎంకరేజ్‌ చేయలేదట. కానీ తనకు మాత్రం నటి కావాలని, సినిమాల్లోకి వెళ్లాలని ఉండేదట. కొంత కాలానికి వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ షిఫ్ట్ అయ్యారు. ఆ సమయంలో ఎట్టకేలకు తాను సినిమాల్లోకి వెళ్లేందుకు ఒప్పుకున్నారట.  

`అలా శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేసిన `ఫిబ్రవరి 14 నెక్టెస్ రోడ్` అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టాను. ఆ తర్వాత మణిశర్మ నిర్మించిన `రూపాయి` అనే చిత్రంలో నటించాను. ఇంతలో బాలాజీ టెలీ ఫిలింస్ వారి సీరియల్స్ లో నటించే అవకాశాలు వచ్చాయి. అలా ముంబై వెళ్లాను. ఆ తర్వాత `ఇంద్ర` సినిమా కోసం అడిగారు. ఆ చిత్రంలో నటించాను. అలా నా కెరీర్ కొనసాగింది. పెళ్లయ్యాక మా వారితో యూఎస్ వెళ్లాను. అప్పటి నుంచి వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించాను. అక్కడ ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాను. మన నృత్యరూపకాలు రేపటి తరానికి కూడా అందాలనేది నా కోరిక. ఈ ఆశయంతోనే క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చాను` అని తెలిపింది. 

ఇంకా చెబుతూ, `మా పాప తాన్య నా దగ్గరే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది. తాన్యతో తెలుగింటి సంస్కృతి పేరుతో మ్యూజిక్ వీడియో రూపొందించాం. ఈ మ్యూజిక్ వీడియోకు ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేసి రూపొందించారు. తెలుగింటి సంస్కృతికి మంచి రెస్పాన్స్ దక్కడం సంతోషాన్ని కలిగించింది. తాన్యకు ఇప్పుడు 16 ఏళ్లు. తన ఏజ్ కు తగిన మంచి అవకాశం వస్తే పాప తాన్యను కూడా సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు మా ఫ్యామిలీకి అభ్యంతరం లేదు` అని వెల్లడించింది. 

`అప్పట్లో మీడియా ప్రభావం ఇంత ఉండేది కాదు. చేస్తే సినిమాలు లేకుంటే సీరియల్స్. ఓటీటీలు లేవు. ఇప్పుడు వెబ్ సిరీస్ లు, ఓటీటీ కంటెంట్ తో ఔత్సాహిక నటీనటులకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలు చూసే మళ్లీ టాలీవుడ్ కు రావాలి అనిపించింది. నటిగా నాకున్న ఇష్టాన్ని చూపించాలని అనుకుంటున్నాను. మనకు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే కథలో కీలకమైన కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. `పెళ్లాం ఊరెళితే` సినిమాలో నేను చేసిన సునీల్ వైఫ్ పాత్ర అలాంటిదే. అలాంటి కథలో కీలకంగా ఉండి ప్రాధాన్యత గల పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి క్యారెక్టర్స్ ఆఫర్స్ లభిస్తే సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ లో నటించాలని ఉంది` అని చెప్పింది ప్రశాంతి హారతి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios