Asianet News TeluguAsianet News Telugu

'మిరాయ్' కాకుండా తేజ సజ్జా కమిటైన మరో చిత్రం, డిటేల్స్

తేజ సజ్జా కమిటైన కొత్త  సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Teja Sajja in talks for one more Film jsp
Author
First Published Apr 27, 2024, 11:40 AM IST

ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమా ఆఫీస్ కు వెళ్లినా తేజ సజ్జా గురించే టాపిక్ వస్తోంది. బాల నటుడుగా తెరంగ్రేటం చేసిన తేజ హీరోగా రెండు మూడు సినిమాలు చేసినా వర్కవుట్ కాలేదు. కానీ హనుమాన్ తో నిలిచిపోయే స్దాయిలో హిట్ కొట్టాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీ టాలీవుడ్‌లో హిస్టరీగా నిలిచిపోయింది. చిన్న చిత్రంగా సంక్రాంతి బరిలోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. హనుమాన్ మూవీని మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ గొప్పగా ఆదరించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తర్వాత తేజ సజ్జా ఏ సినిమా చేయబోతున్నారనే ఆసక్తి అంతటా నెలకొందీ. 

తేజ సజ్జ పేరు టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ హీరో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు హీరోగా  మారి సినిమాలు చేస్తున్నాడు. ఓ బేబీ సినిమాలో నటించి మెప్పించిన తేజ. హీరోగా జంబిరెడ్డి సినిమాతో హిట్  అందుకున్నాడు . 

ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. తేజ సజ్జ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మిరాయ్ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ , టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సారి కూడా తేజ సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా  నుంచి విడుదల చేసిన టైటిల్ వీడియో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తేజ సజ్జా కమిటైన కొత్త  సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే తేజ సజ్జాకు రీసెంట్ గా నందిని రెడ్డి ఓ కథను వినిపించి ఓకే చేయించుకున్నదని తెలుస్తోంది. గతంలో వీళ్లద్దరి కాంబినేషన్ లో ఓ బేబీ వచ్చింది. అయితే ఆ సినిమాలో క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు నందనీ రెడ్డి రెడీ చేసిన కథ మొత్తం తేజ చుట్టూనే తిరగనుందని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా వారు నిర్మించే ఈ చిత్రం త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios