Asianet News TeluguAsianet News Telugu

తలైవర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రజినీకాంత్ 171 నుంచి సాలిడ్ అప్ డేట్..

తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ ఫ్యాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న అప్ డేట్ ను తాజాగా రిలీజ్ చేశారు టీమ్. 

Super Star Rajinikanth and Lokesh Kanagaraj combo 171 Movie First Look poster Release JmS
Author
First Published Mar 28, 2024, 10:14 PM IST

జైలర్ సినిమా నుంచి సూపర్ స్టార్  రజినీకాంత్ లో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. జైలర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన సూపర్ స్టార్..అదే ఊపుతో వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు.  జైలర్ సినిమాతో రజినీకాంత్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఆసినిమా తర్వాత తన 170వ సినిమా వెట్టియాన్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఈసినిమా షూటింగ్ ఎక్కువగా ఆంధ్రాలోనే జరుగింది.   అయితే రజిని అభిమానులతో పాటు అందరూ రజినీకాంత్ 171వ సినిమా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 


 తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో  తెరకెక్కబోతున్న రజినీకాంత్ 171వ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో తన సినిమాలపై హైప్ సృష్టించాడు. ఇప్పుడు రజినీకాంత్ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుందా? ఉండదా? అనేది తెలియదు కానీ లోకేష్ తో రజినీకాంత్ సినిమా అనగానే అభిమానులతో పాటు అందరూ ఎదురు చూస్తున్నారు.

 

కాగా ఈరోజు( మార్చ్  28) సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు భారీ గిప్ట్ అందించారు. రజినీకాంత్ – లోకేష్ తలైవర్ 171వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో రజినీకాంత్ ని బంగారపు వాచ్‌లతో సంకెళ్లు వేసినట్టు ఉంది. రజినీకాంత్ ఓ విలనీ నవ్వుతో అదిరిపోయే లుక్ లో ఉన్నారు. పోస్టర్ వెనక కూడా వాచ్ ఉంది. దీంతో టైం చుట్టూ ఈ సినిమా తిరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది. 

ఇక తలైవర్ 171 సినిమా టైటిల్ ని టీజర్ తో పాటుగా ఏప్రిల్ 22న ప్రకటిస్తామని తెలిపారు. ఈ నేపధ్యంలో తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆధారంగా నెటిజన్లు పలు ఊహగానాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా విడుదలైన పోస్టర్‌లో రజనీకాంత్ పాతకాలపు స్టైల్‌లో కనిపిస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా పీరియాడికల్ ఫిల్మ్ అయ్యే అవకాశం ఉంది. సినిమా టైటిల్  ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఇప్పటికే రకరకాలు ఫ్యాన్ మేడ్ ఫోస్టర్లతో సందడి చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios