Asianet News TeluguAsianet News Telugu

వెంకీ మూవీలో ఫస్ట్ ఛాయిస్ స్నేహ కాదు.. 20 ఏళ్ళ తర్వాత ట్విస్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీనువైట్ల , రవితేజ కాంబినేషన్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు అభిమానులు ఇప్పటికి పడీ పడీ నవ్వుతుంటారు.  

Srinu Vaitla Interesting comments on Venky Movie heroine sneha dtr
Author
First Published Mar 25, 2024, 11:06 AM IST

శ్రీనువైట్ల , రవితేజ కాంబినేషన్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు అభిమానులు ఇప్పటికి పడీ పడీ నవ్వుతుంటారు.  ఇటీవల వెంకీ చిత్రం రీ రిలీజ్ కాగా థియేటర్స్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. 

ముఖ్యంగా రవితేజ, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలని ఆడియన్ ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. బ్రహ్మానందం గజాల పాత్రలో స్క్రీన్ పై కనిపించగానే థియేటర్లు మోతెక్కాయి. దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఈ చిత్ర విశేషలు పంచుకునేందుకు దర్శకుడు శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

Srinu Vaitla Interesting comments on Venky Movie heroine sneha dtr

ఈ ఇంటర్వ్యూలో వెంకీ చిత్రంలో హీరోయిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మూవీలో రవితేజకి జోడిగా స్నేహ నటించింది. ఇద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ స్నేహ కాదట. 20 ఏళ్ళ తర్వాత శ్రీనువైట్ల ఈ విషయాన్ని ఇప్పుడు రివీల్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందుగా అనుకున్నది అసిన్ ని అట. 

కొన్ని కారణాల వల్ల ఆమె ఈ చిత్రంలో నటించలేదు. అంతకు ముందు అసిన్ రవితేజతో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అనే చిత్రంలో నటించింది. వెంకీ చిత్రంలో అసిన్ కుదరకపోవడంతో చివరకి ఆ అవకాశం స్నేహకి దక్కింది. ఈ చిత్రంలో కథ హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. విలన్ హీరోయిన్ మర్డర్ చేయాలని ప్రయత్నిస్తుంటే హీరో అతడి గ్యాంగ్ ఆమెని కాపాడుతూ వస్తారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios