Asianet News TeluguAsianet News Telugu

'ఓం భీమ్ బుష్' ప్రీ రిలీజ్ బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్!

 పర్ఫెక్ట్ సమ్మర్ ఔటింగ్, ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ల‌క్ష్యంగా చేసుకుని వ‌స్తున్న ...

Sree Vishnu Om Bheem Bush WW Pre Release Business jsp
Author
First Published Mar 22, 2024, 8:02 AM IST


 శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి ఆడియన్స్ ని నవ్వించడానికి వచ్చిన  సినిమా ‘ఓం భీమ్ బుష్’. ఇప్పటికే రిలీజైన టీజర్ అండ్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ శుక్రవారం మార్చి 22న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. క్రితం సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర  శ్రీవిష్ణు చిత్రం సామజవరగమనా(Samajavaragamana Movie) సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవటంతో ఈ సినిమాపైనే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో చిత్రానికి మంచి బిజినెస్ అయ్యింది.  

 ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను చూస్తే… 

👉నైజాం: 3Cr
👉సీడెడ్ : 1Cr
👉ఆంద్రా: 4Cr
ఆంధ్రా-తెలంగాణా టోటల్  :- 8CR
👉కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా+ఓవర్ సీస్ – 1.2Cr
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ : 9.30CR(బ్రేక్ ఈవెన్ – 10CR~)
 
సమ్మర్ లో మంచి ఎంటర్ టైనర్ గా అనిపిస్తున్న ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) పర్ఫెక్ట్ సమ్మర్ ఔటింగ్, ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ల‌క్ష్యంగా చేసుకుని వ‌స్తున్న ఈ సినిమా ఈ వేస‌వి సెల‌వుల‌కు ఫ‌ర్ఫెక్ట్ సినిమా అని ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. మొద‌ట కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో బ్యాంగ్ బ్రోస్ ఫన్ ధమాకాతో సినిమా ప్రారంభమై, ఆ తర్వాత భైరవపురం అనే గ్రామానికి చేరుకుని అక్క‌డా నిధి వేట చుట్టూ క‌థ‌నం ఉండ‌నుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, సినిమా చివర్లో భారీ ఎమోషన్‌తో ఊహించని ట్విస్ట్‌లు కూడా ఉండ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) సినిమాలో హై ఎంటర్ టైన్ మెంట్‌తో పాటు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, వన్ లైనర్లు మరింతగా అలరించనున్నాయి. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హిలేరియ పాత్రలు మేజర్ ఎట్రాక్షన్స్ గా నిలవనున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios