Asianet News TeluguAsianet News Telugu

`రజాకార్‌` మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. చరిత్రని వక్రీకరించిన ఫలితమా?..

హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం, రజాకార్ల ఆగడాల నేపథ్యంలో రూపొందిన `రజాకార్‌` మూవీ గత వారం విడుదలైంది. దీనికి వచ్చిన కలెక్షన్లు మాత్రం షాకిస్తున్నాయి. 
 

razakar movie first week collections shocking wha happened ? arj
Author
First Published Mar 22, 2024, 1:48 PM IST

గత వారం విడుదలైన చిత్రాల్లో ప్రముఖంగా వినిపించిన పేరు `రజాకార్‌` మూవీ. ఇది తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్‌ సంస్థానానికి స్వాతంత్ర్యం రాలేదు. ఇది నిజాం నవాబ్‌ ఆధీనంలో ఉంది. ఆయన భారత్‌లో కలిపేందుకు ఒప్పుకోలేదు. పైగా రజాకార్‌ వ్యవస్థని తీసుకొచ్చి జనాలను చిత్ర హింసలు పెట్టారు. బలవంతపు మతమార్పిడికి ప్రయత్నించారు. అనేక అరాచకాలకు పాల్పడ్డారు. వారికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటం పేరుతో తిరుగుబాటు చేపట్టారు. చివరికి కేంద్ర బలగాలు వచ్చి నిజాంని తమ కంట్రోల్‌లోకి తీసుకోవడంతో నిజాం నవాబ్‌ భారత్‌లో హైదరాబాద్‌ని విలీనం చేశాడు.

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

ఈ ఇతివృత్తంతో `రజాకార్‌` సినిమాని రూపొందించారు. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఇందులో ఇంద్రజ, అనసూయ, బాబీ సింహా, మకరంద్‌పాండే, రాజ్‌ అర్జున్‌, వేదిక, ప్రేమ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ మార్చి 15న విడుదల చేశారు. సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. మేకర్స్ పరంగా బాగుందన్నారు. యాక్షన్‌ సీన్లు కూడా బాగా చూపించారు. రజాకార్ల ఆగడాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. కానీ సినిమాకి జనం నుంచి ఆదరణ లేదు. ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. 

తాజాగా ఈ మూవీకి వచ్చిన కలెక్షన్లు షాకిస్తున్నాయి. మొదటి వారం ఈ మూవీ రెండున్నర కోట్ల గ్రాస్‌ సాధించిందట. అంటే కోటిన్నర షేర్‌ వచ్చిందని ట్రేడ్‌ వర్గాల నుంచి తెలుస్తుంది. 2.2కోట్ల బిజినెస్‌ కాగా, ఇప్పటి వరకు కోటిన్నర మాత్రమే షేర్‌ రావడం గమనార్హం. ఈ మూవీని సుమారు 40-50కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. భారీగా తెరకెక్కించారు. కానీ రెండు కోట్ల బిజినెస్‌ జరగడమే మరీ దారుణం అంటే, దానికి వచ్చిన కలెక్షన్లు మరింత దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల జీరో షేర్‌గా నమోదైంది. ఓటీటీకి కూదా దిక్కులేదని తెలుస్తుంది. 

ఈ మూవీ టీజర్‌, ట్రైలర్‌, పాటలతో సంచలనాలు సృష్టించింది. ట్రైలర్‌ అదిరిపోయిందన్నారు. కొంత కాంట్రవర్సీగానూ మారింది. ఆపేయాలనే పిటిషన్‌ దాఖలైందనే వార్తలు వచ్చాయి. ఈ హంగామా హడావుడి ఏదీ సినిమా ఆడియెన్స్ దగ్గరికి చేరడంలో హెల్ప్ కాలేదు. పైగా ఇందులో మరో పెద్ద మిస్టేక్ అనేది బయటకు వచ్చింది. ఆనాటి కథ ఇప్పటి తరాలకు తెలియదు. అది అర్థమయ్యేలా చెప్పడంలో మేకర్స్ విఫలమయ్యారు. జస్ట్ సీన్లని హైలైట్‌ చేసుకుంటూ వెళ్లారు, కానీ ఇందులో డ్రామా లేదు, ఎమోషన్స్ లేదు, కేవలం యాక్షన్‌, రక్తపాతం మాత్రమే ఉంది. అది నేటి ఆడియెన్స్ కి ఎక్కలేదు. 

పైగా ఇది జరిగిన సంఘటనల ఆధారంగా చేసిన మూవీ. కానీ కొంత చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల సమక్షంలో జరిగింది. కానీ ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. వారికి దీనికి సంబంధమే లేదనట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. చరిత్రని మార్చి చెప్పే ప్రయత్నం చేశారు. నిజాం, రజాకార్ల ఆగడాలను మతంతో ముడిపెట్టారు. మతం యాంగిల్‌లో తీసుకున్నారు. ఇవన్నీ ఈ మూవీని జనం పట్టించుకోకపోవడానికి కారణమయ్యిందని చెప్పొచ్చు. అందుకే దీన్ని తిరస్కరించినట్టు తెలుస్తుంది. మొత్తంగా `రజాకార్‌` దారుణంగా పరాజయం చెందడం గమనార్హం. 

Read more: నమ్రతని మహేష్‌ బాబు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కృష్ణ ఫస్ట్ రియాక్షన్‌ ఏంటంటే? కొడుకుని ఎందుకు నమ్మాడు?
 

Follow Us:
Download App:
  • android
  • ios