రష్మిని బాధపెట్టిన నెటిజన్ కామెంట్!
బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోవర్స్ సంఖ్య బాగానే ఉంది. తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.

తాజాగా ఆమె అభిమానులకు పండగ శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ భోగి మంటల వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. ''భోగి మంటల వీడియో పెట్టి మకర సంక్రాంతి అని చెబుతున్నారేంటి..?అది భోగి మేడం.. మకర సంక్రాంతి కాదు.. ముందు మీరు తెలుగు నేర్చుకోండి'' అని రిప్లయ్ చేశాడు.
ఈ ట్వీట్ చూసిన రష్మి బాధ పడినట్లుంది. వెంటనే అతడికి ధీటుగా బదులిచ్చింది. ''మా కుటుంబ మకర సంక్రాంతిని మాత్రమే జరుపుకుంటుంది. అందుకే అందరికీ విషెస్ చెప్పాను. నేను మీ సంప్రదాయాలను గౌరవించి విష్ చేశా.. మీరు కూడా నన్ను గౌరవించాలి. ఎలాంటి కారణాలు లేకుండా మాట్లాడి బాధించకూడదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Happy MAKAR SANKRANTI pic.twitter.com/ADwyk0Bgc3
— rashmi gautam (@rashmigautam27) January 14, 2019
In my family we only celebrate makar Sankranthi andi hence I wished and the way i respect your culture so shud u respect mine rather than making hurtful statements for no reason https://t.co/4EvdgZl8g4
— rashmi gautam (@rashmigautam27) January 14, 2019