Asianet News TeluguAsianet News Telugu

హమ్మయ్య.. రాధే శ్యామ్ డైరెక్టర్ కి హీరో దొరికేశాడు, ఈసారి ఏంచేస్తాడో..

రాధే శ్యామ్ చిత్రం ఆశించిన విధంగా సూపర్ హిట్ అయి ఉంటే ఆ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయేవారు. కానీ కాలం కలసి రాలేదు. రాధే శ్యామ్ తీవ్రంగా నిరాశపరిచింది.

Radhe Shyam Fame Radhakrishna to direct Gopichand once again dtr
Author
First Published Mar 21, 2024, 7:47 PM IST

రాధే శ్యామ్ చిత్రం ఆశించిన విధంగా సూపర్ హిట్ అయి ఉంటే ఆ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయేవారు. కానీ కాలం కలసి రాలేదు. రాధే శ్యామ్ తీవ్రంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా సంగతి పక్కన పెడితే రాధా కృష్ణకి లోకల్ గా కూడా హీరోలు దొరకడం కష్టం అయిపోయింది. 

ఈ చిత్రం విడుదలై రెండేళ్లు గడుస్తున్నా రాధాకృష్ణ తదుపరి చిత్రం ఖరారు కాలేదు. అంత పెద్ద పరాజయం ఎదురయ్యాక సహజంగానే స్టార్ హీరోలు ముఖం చాటేస్తారు. మీడియం రేంజ్ హీరోలు కూడా దొరడం కష్టం అయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాధాకృష్ణ కి ఎట్టకేలకు ఒక అవకాశం వచ్చింది. 

మరోసారి జిల్ కాంబినేషన్ సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రాధాకృష్ణ, గోపీచంద్ కాంబినేషన్ లో దాదాపు 9 ఏళ్ళ క్రితం జిల్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం విజయం సాధించినప్పటికీ స్టైలిష్ మేమింగ్ తో రాధాకృష్ణ ఆకట్టుకున్నాడు. ఆ మూవీలో రాధాకృష్ణ వర్క్ నచ్చడంతోనే ప్రభాస్ తో రాధేశ్యామ్ చేసే అవకాశం వచ్చింది. 

ఇప్పుడు మరోసారి రాధాకృష్ణ గోపీచంద్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రం ఇద్దరికి అగ్నిపరీక్షే అని చెప్పొచ్చు. ఎందుకంటే అటు గోపీచంద్ కెరీర్ కూడా సరైన సక్సెస్ లేక ఒడిదుడుకుల్లో ఉంది. ఈ చిత్రాన్ని కూడా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారైనా రాధాకృష్ణ మ్యాజిక్ చేసి హిట్ కొడతాడో లేదో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios