Asianet News TeluguAsianet News Telugu

చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను... యాంకర్ సుమ సంచలన వీడియో వైరల్!

యాంకర్ సుమ కనకాల ఓ తప్పు చేశారట. అందుకు ఇప్పుడు ప్రాయశ్చితం చేసుకుంటున్నానని వీడియో వదిలింది. సదరు వీడియో చూసిన నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. 
 

punishment for my mistake anchor suma kanakala video goes viral
Author
First Published Apr 12, 2024, 8:11 AM IST

సుమ కనకాల బుల్లితెర మీద ఒక సెన్సేషన్. రెండు దశాబ్దాలుగా ఆమె హవా సాగుతుంది. మలయాళీ అమ్మాయి అయిన సుమ కనకాల తెలుగు యాంకర్ గా సక్సెస్ కావడం గొప్ప విషయం. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన మలయాళీ ఫ్యామిలీ సుమది. మొదట్లో ఆమె నటిగా రాణించాలి అనుకున్నారు. ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. 

సుమ యాంకర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. సమయస్ఫూర్తి, మూడు నాలుగు భాషలపై పట్టు, ఎనర్జీ ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. ముఖ్యంగా సుమ సెన్సాఫ్ హ్యూమర్ అదుర్స్ అని చెప్పాలి. నటుడు రాజీవ్ కనకాలను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ మధ్య సుమ బుల్లితెర షోలు తగ్గించారు. ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ లో ఎక్కువగా సందడి చేస్తుంది. 

యాంకర్ కి కావలసిన ముఖ్యమైన లక్షణాల్లో అందం ఒకటి. 40 ప్లస్ లో ఉన్న సుమ యంగ్ గా కనిపించేందుకు చాలానే ట్రై చేస్తుంది. ట్రెండీ బట్టల్లో సుమ ఫోటో షూట్స్ చేయడం కొసమెరుపు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సుమ ఒక ఆసక్తికర వీడియో షేర్ చేసింది. సదరు వీడియోలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఉగాది పండగ రోజు డైట్ పక్కన పెట్టేసి ఫుడ్ గట్టిగా లాగించేసిందట. అందుకు ప్రాయశ్చితం చేసుకుంటున్నాను అని వర్క్ అవుట్ చేస్తున్న వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఉగాది నాడు పులిహోర, పొంగలి, గారెలు, పాయసం గట్టిగా లాగించాను. అవన్నీ కరిగించడానికి ఈ వ్యాయామం అని సుమ అన్నారు. పండగ తర్వాత ప్రాయశ్చితం ఇలా ఉంటుందని క్యాప్షన్ పెట్టింది. 

ఇక సుమ వీడియో పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో నీకు అవసరమా? మీరు ముసలి వారని కొందరు ఏకి పారేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అదన్నమాట సంగతి. కాగా సుమ తన కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. బబుల్ గమ్ టైటిల్ తో ఈ చిత్రం విడుదలైంది... 

Follow Us:
Download App:
  • android
  • ios