Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ కి పండగే, ప్రభాస్ పరిస్థితేంటి ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక వైపు దేవర, మరోవైపు వార్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు చిత్రాలని బ్యాలెన్స్ చేస్తూ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Prashanth neel and NTR movie latest update dtr
Author
First Published May 8, 2024, 3:24 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక వైపు దేవర, మరోవైపు వార్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు చిత్రాలని బ్యాలెన్స్ చేస్తూ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రాల లైనప్ చాలా ఆసక్తికరంగా ఉంది. 

దేవర చిత్రం తారక్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక వార్ 2 కంప్లీట్ గా బాలీవుడ్ చిత్రం. అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించేందుకు కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో చిత్రానికి ప్రకటన వచ్చింది. 

అయితే ప్రశాంత్ నీల్ ముందుగా ప్రభాస్ తో సలార్ 2 తెరకెక్కిస్తారా లేక తారక్ చిత్రాన్ని ప్రారంభిస్తారా అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం మేరకు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ ఈ ఏడాదే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతే సలార్ 2ని ప్రశాంత్ నీల్ తాత్కాలికంగా పక్కన పెట్టినట్లే. 

2024చివర్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజిలో ఉన్నట్లు తెలుస్తోంది. కథకి ప్రశాంత్ నీల్ తుదిమెరుగులు దిద్దుతున్నారట. 

ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ అనే చెప్పాలి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి కాస్త బ్యాడ్ న్యూస్. ఒకరకంగా ప్రభాస్ కి ఇది మంచిదే. తాను కమిటైన స్పిరిట్ లాంటి చిత్రాలని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios