Asianet News TeluguAsianet News Telugu

#HanuMan:‘హనుమాన్’OTT ట్విస్ట్,...పైరసీకు ప్లస్ అవుతోందా?

 రకరకాల బేర సారాలతో ఓటిటి లేటు అవుతూ వచ్చింది.  ఊరించి ఊరించి మొత్తానికి ఓటిటిలో దింపారు నిర్మాతలు.

Prasanth Varma HanuMan released on three ott platforms jsp
Author
First Published Mar 26, 2024, 6:21 AM IST


సంక్రాంతి బరిలో గుంటూరు కారం సినిమాతో పాటుగా హనుమాన్ రిలీజ్ అయ్యి పెద్ద హిట్టైంది. ఎన్ని అడ్డంకుల మధ్య ఈ మూవీ థియేటర్లోకి వచ్చినా  ముందు రోజు వందలు, వేల సంఖ్యలో పెయిడ్ ప్రీమియర్లు వేసి దుమ్ము రేపారు. ఈ ప్రీమియర్లతోనే దాదాపు రెండున్నర కోట్ల కలెక్షన్ వచ్చింది. అలా ఈ చిత్రానికి మొదటి నుంచి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడే కాకుండా నార్త్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  ఇక ఓవర్సీస్‌లో అయితే ఐదు మిలియన్లు కలెక్ట్ చేసి టాలీవుడ్ హిస్టరీలో కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్ లో చూడని వాళ్లు, ఓ సారి చూసిన వాళ్లు కూడా ఎప్పుడు ఓటిటిలో చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఊరించి ఊరించి మొత్తానికి ఓటిటిలో దింపారు నిర్మాతలు.  రకరకాల బేర సారాలతో ఓటిటి లేటు అవుతూ వచ్చింది. అయితే అక్కడే హనుమాన్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చింది. 

ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని మూడు సంస్దలకు ఇచ్చింది. . ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో (JioCinema OTT) హనుమాన్ హిందీ వెర్షన్ మార్చి 16 అర్ధరాత్రి) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇదివరకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లే హనుమాన్ సినిమాను చూసేందుకు వీలుంటుందని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమా ఓటీటీలో హనుమాన్ మూవీని అవకాసం ఇచ్చారు. హనుమాన్ సినిమాను తెలుగులో కాకుండా ముందుగా హిందీలో ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు.  ఒక్క రోజు తర్వాత మార్చి 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హనుమాన్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. 

అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రియల్ 5 నుంచి ఈ చిత్రం తమిళ, కన్నడ,మళయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ మొదలు కానున్నాయి. ఇలా మూడు ఓటిటిల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ ఈ మధ్యకాలంలో ఏ పెద్ద సినిమాకు జరగలేదు. అయితే ఇదే సమయంలో ఇలా మూడు చోట్ల స్ట్రీమింగ్ జరిగితే కన్ఫూజ్ కూడా అయ్యే అవకాసం ఉందంటున్నారు. అంతేకాదు పైరసీకు చాలా అవకాసం ఉంటుంది. ఒరిజల్ ప్రింట్ లుకు ఆడియోలు కలిపి పైరసీ ప్రింట్స్ వదలుతున్నారు. అవి వ్యూయర్ షిప్ కు దెబ్బ తీస్తున్నారు. గతంలో సలార్ కు అలాగే జరిగింది. 

ఇదిలా ఉంటే "హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయలేదు. చిత్రాన్ని వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము అహర్నిశలు శ్రమిస్తున్నాం. కొన్ని విషయాల పట్ల దృష్టి సారించాం. ఎప్పుడూ మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడమే మా ఉద్దేశం తప్పా ఇంకేం లేదు. దయచేసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. అలాగే మమ్మల్ని ఎప్పటిలాగే సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు" అని ట్విట్టర్‌లో ప్రశాంత్ వర్మ తెలిపాడు.

ఇలా  ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ ‘జియోసినిమా’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో ఏప్రిల్ 5న డిస్నీ+ హాట్‍స్టార్‌లోకి రానుంది. ఇలా.. ఏకంగా మూడు ప్లాట్‍ఫామ్‍ల్లో హనుమాన్ స్ట్రీమింగ్‍కు ఉండనుంది.
 
తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంది.    హనుమాన్ సినిమా భారతీయ భాషలైన తెలుగు, హిందీ, మరాఠీ,తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రిలీజ్ అవటం విశేషం. ఈ మూవీని నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios