Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ పెళ్లి.. ఈ సారి పక్కా!

టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి చేసుకోవాల్సిన సినీనటులు చాలా మందే ఉన్నారు. అందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ బాయ్ ప్రభాస్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతం కొంత కాలంగా ఈ రెబల్ స్టార్ పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా ప్రభాస్ పెద్దమ్మ పెదనాన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చింది.

krishnam raju wife shyamala about prabhas marriage
Author
Hyderabad, First Published Mar 8, 2019, 3:34 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి చేసుకోవాల్సిన సినీనటులు చాలా మందే ఉన్నారు. అందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ బాయ్ ప్రభాస్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతం కొంత కాలంగా ఈ రెబల్ స్టార్ పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా ప్రభాస్ పెద్దమ్మ పెదనాన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చింది.

కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి గురించి మాకు కూడా తొందరగానే ఉంది. అలాగే పెళ్లిపై వస్తోన్న రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోము. వాటిని చూసి సరదాగా నవ్వుకుంటాం. పెళ్లి గురించి ప్రభాస్ ని అడిగితే ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాలు అయిపోనివ్వండి అప్పుడు ఆలోచిస్తాను అని సమాధానం ఇస్తున్నాడు. ఇక ఆ రెండు సినిమాలు త్వరలోనే పూర్తవుతాయి. అప్పుడు తీపిగా పెళ్లి కబురు చెబుతానని శ్యామల దేవిగారు వివరణ ఇచ్చారు. 

ప్రస్తుతం రెబల్ స్టార్ సాహో సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఇక రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక లవ్ స్టోరీని కూడా ప్రభాస్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  

photos లేడి గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చిన హీరోలు

Follow Us:
Download App:
  • android
  • ios