Asianet News TeluguAsianet News Telugu

F2 కలెక్షన్స్: 20 కొట్టేశారుగా!

దిల్ రాజుకి మంచి లాభాలను అందిస్తున్న F2 బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఏపి తెలంగాణలో కలిపి ఇటీవల అందిన లెక్కల ప్రకారం 20 కోట్ల వరకు షేర్స్ అందించినట్లు తెలుస్తోంది. 

F2 MOVIE LATEST BOX OFFICE COLLECTIONS
Author
Hyderabad, First Published Jan 16, 2019, 2:46 PM IST

సంక్రాంతి ఫెస్టివల్ లో చిన్న సినిమాగా వచ్చిన F2 అందరికంటే పెద్ద హిట్ ను అందుకుంది. వెంకటేష్ - వరుణ్ తేజ్ లకు మంచి హిట్ ఇచ్చిన ఈ సినిమా తమన్నా - మెహ్రీన్ కి కూడా క్రేజ్ ను తెచ్చింది. ఇకపోతే దిల్ రాజుకి మంచి లాభాలను అందిస్తున్న F2 బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. 

ఏపి తెలంగాణలో కలిపి ఇటీవల అందిన లెక్కల ప్రకారం 20 కోట్ల వరకు షేర్స్ అందించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 25 కోట్ల బడ్జెత్ తో తెరకెక్కించిన ఈ సినిమా 32 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా బయ్యర్స్ ని సేఫ్ జోన్ లోకి తెచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఈ వారం ఎండ్ వరకు మరిన్ని లాభాలను అందించే అవకాశం ఉంది. 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. పోటీగా ముందే దిగిన పెద్ద సినిమాలకు ప్లాప్ టాక్ రావడంతో F2 కి బాగా కలిసివచ్చింది. అంతే కాకూండా సినిమా టాక్ కూడా పాజిటివ్ గా ఉండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios