Asianet News TeluguAsianet News Telugu

భారతీయుడు2 నుంచి దిల్ రాజు ఎందుకు తప్పుకున్నాడు

  • కమమల్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు
  • 1996లో రిలీజై భారీ సక్సెస్ సాధించిన భారతీయుడు
  • భారతీయుడు సీక్వెల్ సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించిన దిల్ రాజు
  • తాజాగా దిల్ రాజు భారతీయుడు 2 నుంచి తప్పుకున్నట్లు వార్తలు
dil raju opted out of shankar kamal bharatiyudu 2 project

నిర్మాత దిల్ రాజు అంటేనే తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్. మిడిల్ నుంచి హై రేంజ్ బడ్జట్ సినిమాలు తెరకెక్కించి భారీ సక్సెస్ లు మూటగట్టుతోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దీంతో ఇటీవలే ఓ భారీ ప్రాజెక్టులో దిల్ రాజు భాగస్వామి అయ్యాడు. అదే విలక్షణ నటుడు కమల్ హాసన్, శంకర్ ల కాంబినేషన్ లో ప్లాన్ చేసిన భారతీయుడు2. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారని పబ్లిగ్గా ప్రకటించేశారు.

 

సక్సెస్ ల రికార్డులు సాధించిన దిల్ రాజు 180 కోట్ల బడ్జెట్ తో భారతీయుడు2 ప్రాజెక్ట్ చేయటానికి పూనుకున్నాడు అనగానే తెలుగు పరిశ్రమలో అంతా వారెవా అనుకున్నారు. గతంలో దీనిపై ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కాని అది కుదరలేదు. ఫైనల్ గా భారతీయుడు-2కు రంగం సిద్ధమైంది. దిల్ రాజు ఆ సినిమా నిర్మిస్తున్నారని అఫిషియల్ గా చెప్పేశారు.

 

‘భారతీయుడు' అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. కమల్ హాసన్‌కు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది. ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. అయితే చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. భారతీయుడు చిత్రాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం కూడా గతంలో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు. అయితే చాలాకాలం గడిచిపోయింది. ఇక ఆ రెండో పార్ట్ సంగతే అంతా మర్చిపోయాక మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ని తెరమీదకి తెచ్చే ప్రయత్నాలని మొదలు పెట్టారు. అందులో భాగంగానే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నిర్మాతగా మారాడు..

 

అయితే సడెన్ గా ఏమయ్యిందో ఏమో గానీ అయితే తాజాగా ఆ సినిమా నుంచి దిల్ రాజు త‌ప్పుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. శంక‌ర్‌, క‌మ‌ల్‌హాస‌న్ కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్‌తో ఇప్ప‌ట్లో సినిమా తీయ‌డం మంచి ఆలోచ‌న కాద‌ని భావించ‌డం వ‌ల్లే ఆ సినిమా నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నార‌ట‌.

 

శంక‌ర్ దర్శకత్వంలో ప్ర‌స్తుతం `రోబో 2.0` తెరకెక్కుతోంది. ఈ మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. దిల్ రాజు త‌ప్పుకోవ‌డంతో `భార‌తీయుడు-2`ను కూడా ఆ సంస్థే టేకప్ చేస్తుందని తాజా స‌మాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపై దిల్ రాజు స్పందిస్తేగానీ అసలు కారణాలేమిటన్నది తెలిసే అవకాశం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios