Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యకు,పవన్ కు విలన్..ఇప్పుడు మరో పెద్ద ఆఫర్

బాబీడయోల్ కమిటైన మరో చిత్రం గురించిన వార్త బయిటకు వచ్చింది.
 

Bobby Deol is roped in for an important role for YRF Spy Universe jsp
Author
First Published Mar 29, 2024, 2:38 PM IST


'యానిమల్‌' సినిమాలో విలన్‌గా బాబీ డియోల్ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఆ  సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా తన యాక్టింగ్, యాక్షన్‌తో అదరకొట్టాడు.  ఆ నటుడు బాలకృష్ణ సినిమాలోకి తీసుకున్నారు. బాలయ్య- బాబీ డియోల్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బాబీడయోల్ కమిటైన మరో చిత్రం గురించిన వార్త బయిటకు వచ్చింది.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మోస్ట్ వాంటెడ్ విలన్ మరో సినిమా కమిటయ్యాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ కొత్త స్పై సిరీస్ మూవీలో బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ఇప్పటికే ‘టైగర్’, ‘వార్’, ‘పఠాన్’ సినిమాల ద్వారా ‘స్పై వెర్స్’ని రూపొందించింది. ఇప్పుడు ఓ మహిళా గూఢచారిని పరిచయం చేస్తూ అలియా భట్‌తో స్పై సినిమా చేయబోతున్నారు.

అలియా భట్, శర్వరీ వాగ్ జంటగా నటిస్తున్న కొత్త స్పై సినిమాలో బాబీ డియోల్ విలన్‌ గా నటించనున్నాడు. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభం కానుందని సమాచారం. బాబీ డియోల్ ప్రస్తుతం తమిళ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువ’లో విలన్‌గా నటిస్తున్నాడు. దీంతో పాటు తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంలో కూడా విలన్‌గా నటిస్తున్నాడు. చారిత్రక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంలో విలన్‌గా కనిపించనున్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios