డివైడ్ టాక్ కే ఈ కలెక్షన్స్ ఉంటే ఇంక హిట్ టాక్ వస్తేనా....!
ఈ మూవీ హైప్‍తో మే 3వ తేదీన థియేటర్లలో రిలీజైంది. మూడేళ్ల తర్వాత అల్లరి నరేశ్ మళ్లీ కామెడీ ట్రాక్‍కు వచ్చేయటంతోనూ ఈ చిత్రానికి బజ్ బాగా వచ్చింది.
అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం మొన్న శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ కామెడీ సినిమా చేయటం, ఆ ఒక్కటి అడక్కు టైటిల్, ట్రైలర్ అన్ని కలిసి వచ్చి అంచనాలను పెంచేసాయి. అయితే రిలీజ్ రోజు మార్నింగ్ కే డివైడ్ టాక్ వచ్చింది. అయినా సరే కామెడీ సినిమా కావటంతో శని,ఆదివారాలు వీకెండ్ జనం బాగానే వెళ్లటం కలిసివచ్చింది. అందుకు తగ్గట్టుగానే వసూళ్లను రాబడుతోంది. అద్బుతం అని చెప్పలేం కానీ బాగానే కలెక్ట్ చేసింది. అయితే అసలు పరీక్ష ఈ రోజు అంటే సోమవారం మొదలైంది.
మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు.. కాస్త ఎక్కువగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి. అయితే సినిమా మూడో రోజు మాత్రం రెండో రోజు కన్నా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. నైజాంలో చాలా చోట్ల డ్రాప్ అవ్వగా ఆంధ్ర సీడెడ్ లలో కూడా బుకింగ్స్ కొంచం స్లో అయ్యాయి..మొత్తం మీద మూడవ రోజు ఆదివారం రోజున డ్రాప్ అయినా ఓవరాల్ గా వీకెండ్ లో డివైడ్ టాక్ తో కూడా ఆ ఒక్కటి అడక్కు పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది.
ఒకసారి సినిమా వీకెండ్ మూడు రోజుల్లో ప్రపంచం వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉 నైజాం – 0.72CR
👉మొత్తం ఏపీ: 0.91CR~
మొత్తం ఆంధ్రా, తెలంగాణా కలెక్షన్స్ :- 1.63CR~(3.50CR~ Gross)
👉కర్ణాటక+రెస్టాఫ్ ఇండియ+ఓవర్ సీస్ : 0.25CR~
టోటల్ వరల్డ్ వైజ్ కలెక్షన్స్ - 1.88CR(4.20CR~ Gross)
సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం సినిమా మే 3న ఆ ఒక్కటి అడక్కు చిత్రానికి పోటీగా రిలీజ్ అయింది. ఫేస్ బ్లైండ్‍నెస్ కాన్సెప్టుతో వచ్చిన థిల్లర్ ప్రసన్నవదనం చిత్రానికి మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి.