Asianet News TeluguAsianet News Telugu

'సాహో' చాప్టర్ 2.. ఈసారి హీరోయిన్!

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

about saaho chapter 2
Author
Hyderabad, First Published Mar 1, 2019, 4:57 PM IST

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి చాప్టర్ వన్ అంటూ ప్రభాస్ కి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

అందులో దుబాయ్ ఎపిసోడ్ ని, ప్రభాస్ లుక్ ని చూపించారు. ఇప్పుడు చాప్టర్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చాప్టర్ 2 లో ప్రభాస్ కంటే కీలకంగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని చూపించబోతున్నారని సమాచారం.

సినిమాలో ఆమె క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ ని వదలబోతున్నారు. మార్చి 3న శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను వాడులుతారని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ కనిపిస్తాడు కానీ ఎక్కువగా శ్రద్ధా కపూర్ కనిపిస్తుందని సమాచారం. చాప్టర్ 2 అలా హీరోయిన్ కోసం ఫిక్స్ చేశారన్నమాట.

వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios