Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన బన్నీ విలన్!

హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

BJP MP Ravikishan and padmini kolhapure cast their votes
Author
Hyderabad, First Published Oct 21, 2019, 10:38 AM IST

సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ మొదలైంది.  మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 3,237 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో 235మంది మహిళలు ఉన్నారు. 

మరోవైపు హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు, గోరక్ పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ ముంబై గూర్గాన్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 

అలానే సినీ నటి పద్మిని కొల్హాపూర్ అంధేరీ(వెస్ట్) పోలింగ్ బూత్ లో ఓటు వేసి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.  పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెలువడనున్నాయి.

ఏ పార్టీ గెలుపు జెండా ఎగురవేస్తుందో తెలియాలంటే ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా.. ప్రధాని మోదీ  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios