Asianet News TeluguAsianet News Telugu

జగన్ సెల్ఫ్ గోల్ ... రెండుసార్లు

Jagan scores two self goals in series

 

నిన్నటి రోజున వై‌ఎస్ జగన్ రెండు కీలకమైన అంశాల్లో తప్పటడుగు వేశారు.

 

ఒకటి "ఎం‌పి ల రాజీనామా అంశం" . రెండు "ఆంధ్రజ్యోతి మీడియాను  బహిష్కరించడం".ఈ రెండూ జగన్ చేసుకొన్న "సెల్ఫ్ గోళ్ళే" అనడంలో అనుమానమే లేదు.. ఇలా అంటే వై‌సి‌పి వీరాభిమానులకు ఆగ్రహం కలగవచ్చేమో కానీ, ఇదిమాత్రం వాస్తవం.

 

మొదటి సెల్ఫ్ గోల్ 

 

 మొన్నటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ "జూన్ లో మా ఎం‌పిలందరూ రాజీనామాలు చేసి జనాల్లేకి వెళతాము" జగన్ అంటూ ఆవేశంగా ప్రకటించేశారు. రాష్ట్ర సమస్యలపై ఎం‌పి లు రాజీనామా చేయడమేమిటి ?దానివల్ల ఏమి సాధించాలనుకొంటున్నారు ? అంటూ అప్పుడే చాలామంది బుగ్గలు నొక్కుకొన్నారు. అసలు రాజీనామాలు చేయాలంటే, తన ఎం‌ఎల్‌ఏ లను లాక్కొన్న చంద్రబాబు వైఖరికి నిరసనగా అందరి ఎం‌ఎల్‌ఏ ల చేత రాజీనామాలు చేయించి, అసెంబ్లీని బహిష్కరించి, అప్పుడు జనాల్లోకి పోయినా ఒక అర్థం ఉండేదేమో.

 

సరే, ఎం‌ఎల్‌ఏ ల రాజీనామా అన్నది రిస్క్ అనుకొని వెనకడుగు వేసి ఉండవచ్చు. - మరి ఈ "ఎం‌పి ల రాజానామా ఆవేశ ప్రకటనకు" భావమేమి తిరుమలేశా?  ఒకవేళ ప్రకటించాడే అనుకో, మరిప్పుడు ఇలా ఈ తడబాటు ఎందుకు ?

 

 "అబ్బే, రాజీనామాలతో సాధించేది ఏముంది ? అలా చేస్తే మనకే నష్టం - ఎం‌పి లుగా ఉంటూనే పోరాడాలి" అంటూ నిన్న రాత్రి చిలకపలుకులు పలికారు. అంటే, కొన్ని నెలలక్రితం "మా ఎం‌పి లు అందరూ రాజీనామా చేస్తాము" అంటూ చేసిన ప్రకటన ఎటువంటి ముందస్తు వ్యూహమూ లేకుండానే ఆవేశంతో చేసినట్లేనా ?  తీరా ఇప్పుడు అబ్బే, రాజీనామాలవల్ల ఉపయోగంలేదు అంటూ సూక్తులు చెబితే, "ఖచ్చితంగా వెనకడుగు వేసినట్లే" అన్నది నిర్వివాదాంశం.

 

 రాజీనామాలు చేసితీరాలి నేననడం లేదు.. రాజకీయాల్లో వ్యూహాలు చాలా ముఖ్యం అని చెప్పడమే నా ఉద్దేశ్యం.. . .... జగన్ తరచూ అనే "మాట తప్పం - మడమ తిప్పం"" అన్న అన్న సిగ్నేచర్ డైలాగుకు ఇపుడు అసలు విలువలేకుండా పోయింది.

 

 రెండవ సెల్ఫ్ గోల్

 

 "ఆంధ్రజ్యోతి మీడియాను మా పార్టీ బహిష్కరిస్తుంది" అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఒక "పరిణితి లేని ప్రకటన". చంద్రబాబు గారు సాక్షి మీడియాను బహిష్కరించారు అంటూ ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసి, నానాయాగీ పెడుతూ, సాక్షి పేపర్లో తాటికాయంత అక్షరాలతో, సాక్షి టి‌వి లో పదేపదే ప్రోగ్రాములు వేయడం జగన్  మనుషులు మరిచిపోయినా, జనాలు ఇంకా మరవలేదు."వీళ్ళకు యతిరేకంగా రాస్తుందని ఆంధ్రజ్యోతి మీడియాను బహిష్కరించడం" అన్నది  ఏమాత్రం సమర్థనీయం కాదు

 

మీడియా ను నిర్బంధించకూడదు.. వాళ్ళని రమ్మనండి.. వాళ్లకిష్టమొచ్చింది రాసుకోనీయండి... వాళ్ళ దుష్ప్రచారాన్ని మీరు సమర్థవంతంగా తిప్పికొట్టండి.. అపుడే మీ సమర్థత జనాలకి తెలుస్తుంది.. - బహిష్కరించడం పరిష్కారం కానేకాదు.

 

 ఆంధ్రజ్యోతిని బహిష్కరించడం వల్ల, మీరు అభాసు పాలుకావడం మాత్రమే కాదు, ఆంధ్రజ్యోతికి మరింత మద్దతు సంపాదించే పెడుతున్నారు. అంధ్రజ్యోతికి తన ధోరణ కొనసాగించే  ఒక సువర్ణావకాశం అందిస్తున్నారు.

 

మీ బలహీనతలను మీరే ఎత్తి చూపుకొన్నారు... - ఇది ముమ్మాటికీ జగన్ చేసుకొన్న మరొక సెల్ఫ్ గోల్..!! . ..... ఇలా తప్పులమీద తప్పులు చేసుకొంటూ పోవడానికి కారణం, "సరైన వ్యూహాలు లోపించడమే".. జగన్ చుట్టూ ఉన్న సలహాదారులెవరో మరి..!!

 

(*రచయిత సాంఘిక,రాజకీయ విశ్లేషకుడు, హైదరాబాద్)