Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్‌ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. కర్నూల్ జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ శివప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

acb officers raids on mvi sivaprasads house in kurnool
Author
Kurnool, First Published Oct 3, 2019, 11:17 AM IST

కర్నూల్: కర్నూల్ నగర శివారులోని పంచలింగాల ఆర్టీఏ చెక్‌పోస్టులో  మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ ఎ.శివప్రసాద్‌ ఇంట్లో గురువారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయని ఆరోపణలపై నగరంలో డాక్టర్స్ కాలనీలోని శివ ప్రసాద్ ఇంటిలో అధికారులు సోదాలు చేశారు.ఈ సోదాల్లో దాదాపు 8 కోట్ల రూపాయల ఆస్తులు, 1 కేజీ బంగారు, 1లక్ష 50 వేల నగదును గుర్తించారు అధికారులు. ఏకకాలంలో 5 చోట్ల దాడులు చేశారు.

కర్నూలు, హైద్రాబాద్, బెంగళూరు, తాడిపత్రిలో సోదాలు చేస్తున్నారు అధికారులు. శివప్రసాద్ కు  యూగాండా దేశంలో బ్యాంక్ అకౌంట్ ను గుర్తించారు అధికారులు. ఇంకా మరిన్ని సోదాలు చేస్తున్నామని  అధికారులు తెలిపారు.

శివప్రసాద్ పేరున ఇప్పటికే  పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.  శివప్రసాద్ కు చెందిన బంధువుల ఇళ్లలో కూడ సోదాలు చేస్తునన్రారు. బంగారం, వెండి కూడ స్వాధీనం చేసుకొన్నారు. సోదాలు కొనసాగుతున్నట్టుగా ఏసీబీ డిఎస్పీ జయరాం ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios