Asianet News TeluguAsianet News Telugu

ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్: స్వదేశీ గడ్డపై వన్డే సిరీస్ లోనూ కోహ్లీ సేన ఓటమి

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో జరిగిన చివరి ఐదో వన్డేలో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. స్వదేశీ గడ్డపై ఇండియా చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియా భారత్ లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది.

India vs Australia, 5th ODI , Live Update
Author
Delhi, First Published Mar 13, 2019, 1:31 PM IST

ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా డిల్లీలో జరిగిన చివరి మ్యాచ్ లో భారత్ పై ఆసిస్ విజయం సాధించింది. 35 పరుగుల తేడా ఆస్ట్రేలియా భారత్ ను చిత్తు చేసింది. దీంతో 3-2 తేడాతో వన్డే సీరిస్ ఆసిస్ సొంతమైంది. ఇలా స్వదేశంలో టీమిండియాను టీ20, వన్డే సీరిస్ లలో మట్టికరిపించి ఆసిస్ తమకు స్వదేశంలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.

డిల్లీ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించినా బ్యాట్ మెన్స్ తడబడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ ను 272 పరుగులకే కట్టడి చేసినా లక్ష్యచేధనలో బ్యాట్ మెన్స్ తడబడ్డారు.  మొదట్లో రోహిత్ శర్మ(56 పరుగులు) తో, చివర్లో జాదవ్ (44 పరుగులు), భువనేశ్వర్ (46 పరుగులతో) పోరాడినా విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్  237బ పరుగులకే ఆలౌటయ్యింది.   

ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా 3, కమ్మిన్స్ 2, రిచర్డ్ సన్ 2,స్టోయినీస్ 2, లియాన్ 1 వికెట్ పడగొట్టారు. ఇలా నిర్ణయాత్మక డిల్లీ వన్డేలో ఆసిస్ బౌలర్లు విజృంభించి సీరిస్ ను ఎగరేసుకుపోవడంలో ఆసిస్ కు సహాయపడ్డారు. 

నిలకడగా ఆడుతూ గెలుపుపై ఆశలు రేకెత్తించిన భువనేశ్వర్ కుమార్(46 పరుగులు), కేదార్ జాదవ్(44 పరుగులు) వరుస బంతుల్లో ఔటయ్యారు. కమ్మిన్స్ బౌలింగ్ లో భువి..రిచర్డ్ సన్ బౌలింగ్ లొో జాదవ్ ఔటయ్యారు. దీంతో భారత్ ఓటమి దాదాపుగా ఖరారైంది.

టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతూ వన్డే సీరిస్ విజయానికి అంతకంతకు దూరమవుతూ వచ్చింది. సమయోచితంగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన రోహిత్ శర్మ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ వెంటనే జడేజా క్రీజులోకి వస్తూనే స్టంపౌటయ్యాడు. దీంతో భారత్ కేవలం 132 పరుగుల వద్దే 6 వికెట్లు కోల్పోయింది. 

టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. విజయ్ శంకర్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కవాజా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఓ వైపు రోహిత్ శర్మ నిలకడగా ఆడుతుంటే అతడికి సహకరించే ఆటగాళ్లు కరువయ్యారు. దీంతో రోహిత్ ఒంటరి పోరాటం చేశాడు.

ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ అతడు 74 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 

లక్ష్యచేధనలో భారత్ తడబడింది. ఆదిలోనే ఓపెర్ ధవన్ వికెట్ కోల్పోగా ఆ తర్వాత కెప్టెన్  కొహ్లీ, రిషబ్ పంత్ కూడా వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 91 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 273 పరుగుల లక్ష్యచేధన కోసం బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొహాలీ వన్డేలో సెంచరీతో చెలరేగిన భారత ఓపెరన్ శిఖర్ ధావన్ డిల్లీలో రాణించలేకపోయాడు. అతడు కేవలం 12 పరుగుల వద్దే కమ్మిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  

ఆస్ట్రేలియా వన్డేలో మొదట్లో భారీ పరుగల దిశగా సాాగిన ఆసిస్ ఇన్నింగ్స్ కేవలం 272 పరుగుల వద్దే ముగిసింది. ఓపెనర్ ఖవాజా సెంచరీతో చెలరేగడంతో ఆసిస్ 175 పరుగుల వద్ద కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో కనిపించింది. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో మరో వంద పరుగుల్లోపే ఆసిస్ 8 వికెట్లు కోల్పోయింది. ఇలా ఆసిస్ కేవలం 272 పరుగుల మాత్రమే చేసి భారత్ ముందు 273 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. 

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, రవీంద్ర జడేజా 2, కుల్దీప్ యాదవ్ 2, షమీ 1 వికెట్ పడగొట్టాడు. బుమ్రా వికెట్లేవి పడగొట్టకున్నా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి ఆసిస్ ను తక్కువ  పరుగులకే కట్టడి చేయడంలో సాయపడ్డాడు.  

ఆస్ట్రేలియా జట్టు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బ్యాట్ మెన్ కమ్మిన్స్  భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అతడికే రిటర్న క్యాచ్ ఇచ్చి  ఔటయ్యాడు. 

ఆసిస్ జట్టుకు ఓపెనర్ ఖవాజా సెంచరీతో అదిరిపోయే ఆరంభం లభించినా ఫలితం లేకుండా పోయింది. ఖవాజా ఔటైన  తర్వాత ఆసిస్ బ్యాట్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇలా 175 పరుగుల వద్ద కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో వున్న ఆసిస్ 230 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆరో వికెట్ రూపంలో స్టోయినీస్, ఏడో వికెట్  గా క్యారీ పెవిలియన్ కు చేరారు. 

మొహాలీ వన్డేలో ధనాధన్ బ్యాటింగ్ తో భారత విజయావకాశాలపై నీళ్లుచల్లిన టర్నర్ డిల్లీ వన్డేలో మాత్రం రాణించలేకపోయాడు. అతడు కేవలం 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో 210 పరుగుల వద్ద ఆసిస్ ఐదో వికెట్ల కోల్పోయింది. 

ఆసిస్ నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే  హ్యండ్స్ కోబ్ మహ్మద్ షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో ఆసిస్ 182 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.  

కాస్త ఆలస్యంగానైనా భారత బౌలర్ల జోరు మొదలయ్యింది. సెంచరీతో కదంతొక్కిన ఓపెనర్ ఖవాజా, విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్ వెల్ లను భారత బౌలర్లు వెంటవెంటనే పెవిలియన్ కు పంపించారు. దీంతో 175 పరుగుల వద్ద కేవలం ఒకే  వికెట్ కోల్పోయిన ఆసిస్ 178 పరుగులకు చేరే సరికి మూడు వికెట్లు కోల్పోయింది.   

ఐదు వన్డేల సీరిస్ విజయాన్ని నిర్ణయించే డిల్లీ వన్డేలో ఆసిస్ బ్యాట్ మెన్స్ చెలరేగి ఆడారు. ఓపెనర్ ఖవాజా భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ సాధించాడు. 101 బంతుల్లో 100 పరుగులనుమ పూర్తి చేసుకున్నాడు. 

డిల్లీలో జరుగుతున్న చివరి వన్డేలో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ మొదటి వికెట్ కోల్పోయింది. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ ఆరోన్ పించ్ ను భారత్ స్పిన్నర్ ఔట్ చేశాడు. దీంతో 76 పరుగుల వద్ద ఆసిస్ మొదటి వికెట్ కోోల్పోయింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఢిల్లీలో జరిగిన చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios