Asianet News TeluguAsianet News Telugu

మొహాలీ వన్డే: టర్నర్ టర్న్, ఇండియాపై ఆసీస్ విజయం, సిరీస్ సమం

భారత్ తమ ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియా సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారత్ నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. చివరలో టర్నర్ మ్యాచ్ ఫలితాన్నే టర్న్ చేశాడు. 

India vs Australia, 4th ODI, live updates
Author
Mohali, First Published Mar 10, 2019, 1:13 PM IST

భారత్ పై జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచుల వన్డే సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారత్ తమ ముందు ఉంచిన 359 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. హ్యాండ్స్ కోంబ్ సెంచరీతో అదరగొట్టగా, చివరలో టర్నర్ మ్యాచు ఫలితాన్నే టర్న్ చేశాడు. అతను ఆరు సిక్స్ లు ఐదు ఫోర్లతో 43 బంతుల్లో 84 పరుగులుచేసి అజేయంగా నిలిచాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. దీంతో ఐదు మ్యాచుల వన్డే సిరీస్ 2-2తో సమమైంది. ఐదో వన్డే ఇరు జట్లకు కూడా కీలకం కానుంది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, చాహల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. భారత ఓపెనర్లు రాణించినప్పటికీ టెయిల్ ఎండర్లు విఫలమయ్యారు. అయినప్పటికీ భారీ స్కోరునే సాధించినా ఫలితం లేకుండా పోయింది.

భారత్ పై జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 271 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. సెంచరీ వీరుడు హ్యాండ్స్ కోంబ్ 117 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగులో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.అస్ట్రేలియా 229 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఖవాజా 91 పరుగులు చేసి అవుట్ కాగా, మాక్స్ వెల్ 23 పరుగులు చేసి అవుటయ్యాడు. 

అంతకు ముందు అస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పీటర్ హండ్స్‌కోంబ్ అర్ద సెంచరీ చేశారు. అస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖావాజా కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్‌లో షాన్ మార్ష్ పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ఆ రెండో వికెట్ కోల్పోయింది, ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అరోన్ ఫించ్ పరుగులేమి చేయకుండానే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డకౌటయ్యాడు.

మొహాలీ వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించి... ఆస్ట్రేలియాకు 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ 143, రోహిత్ శర్మ 95, పంత్ 36 పరుగుల తో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 5, రిచర్డ్‌సన్ 3, జంపా 1 వికెట్ పడగొట్టారు. 

చివరి ఓవర్లో స్కోరును పెంచే క్రమంలో శంకర్ ఔటయ్యాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్‌లో లాంగ్ షాట్‌కు ప్రయత్నించి మ్యాక్స్‌వెల్ చేతికి చిక్కాడు. భువనేశ్వర్ కుమార్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. రిచర్డ్సన్ బౌలింగ్‌లో 1 పరుగు చేసి భువీ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. కమ్మిన్ బౌలింగ్‌లో 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేదార్ జాదవ్ ఔటయ్యాడు.భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో కమ్మిన్ బౌలింగ్‌లో 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిషబ్ పంత్ ఔటయ్యాడు.

భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆడమ్ జంపా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. స్వల్ప పరుగుల తేడాతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. రిచర్డ్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ వెనుదిరిగాడు. భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 143 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్‌లో ధావన్ పెవిలియన్ చేరాడు. 

అంతకు ముందు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లో ధావన్ శతకం సాధించాడు. ఇందులో 12 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఇది ధావన్‌కు వన్డేల్లో 16వ సెంచరీ. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ ఔటై తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ ఇన్నింగ్సులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేశాడు.61 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.ఇందులో మూడు ఫోర్లు, ఒక్క సిక్స్ ఉన్నాయి.

శిఖర్ ధావన్  44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతనికి వన్డేల్లో 28వ అర్థసెంచరీఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, మూడో వన్డేలో గెలిచిన ఆస్ట్రేలియా ... టీమిండియాకు గట్టి పోటినిచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్... సిరీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని ఆసీస్ పట్టుదల నెగ్గింది. 

Follow Us:
Download App:
  • android
  • ios