Asianet News TeluguAsianet News Telugu

విండ్ కమాండర్ అభినందన్ ను అవమానిస్తూ...పాక్ ప్రపంచ కప్ ప్రచారం ( వీడియో)

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో అత్యంత ఉత్కంఠభరిత పోరు భారత్-పాక్ ల మధ్య జరగనుంది.  ఇప్పటికే ఈ మ్యాచ్ పై ఇరుదేశాల అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచ కప్ టోర్నీ మొత్తం ఒకెత్తయితే ఇండో పాక్ మ్యాచ్ మరో ఎత్తులో నిలిచింది.  అయితే ఈ మ్యాచ్ పై అభిమానుల్లో నెలకొన్న ఆసక్తిని సొమ్ముచేసుకోవాలని  భావించిన ఓ పాకిస్తాని టీవి ఛానల్ దురంహంకారాన్ని ప్రదర్శించింది. భారత వింగ్ కమాండర్ అభినందన్ ను అవమానించేలా ప్రపంచ కప్ వీడియోను తయారుచేసి  వివాదానికి తెరలేపింది. 

world cup 2019:'Racist' World Cup Ad by Pakistan That Mocks IAF Pilot Abhinandan
Author
Hyderabad, First Published Jun 11, 2019, 3:43 PM IST

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో అత్యంత ఉత్కంఠభరిత పోరు భారత్-పాక్ ల మధ్య జరగనుంది.  ఇప్పటికే ఈ మ్యాచ్ పై ఇరుదేశాల అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రపంచ కప్ టోర్నీ మొత్తం ఒకెత్తయితే ఇండో పాక్ మ్యాచ్ మరో ఎత్తులో నిలిచింది.  అయితే ఈ మ్యాచ్ పై అభిమానుల్లో నెలకొన్న ఆసక్తిని సొమ్ముచేసుకోవాలని  భావించిన ఓ పాకిస్తాని టీవి ఛానల్ దురంహంకారాన్ని ప్రదర్శించింది. భారత వింగ్ కమాండర్ అభినందన్ ను అవమానించేలా ప్రపంచ కప్ వీడియోను తయారుచేసి  వివాదానికి తెరలేపింది. 

ఇటీవల పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ భూబాగంలోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ సర్జికల్ స్ట్రైక్  కోసం యుద్దవిమానాన్ని తీసుకుని పాక్ భూభాగంలోకి వెళ్లిన వింగ్ కమాండర్ అభినందన్ ప్రమాదవశాత్తు పాక్ చేతికి చిక్కాడు. అయితే అతడిని చిత్రహింసలకు గురిచేసి విచారణ చేసిన పాక్ చివరకు అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా గత్యంతరం లేక భారత్ అప్పగించింది. 

ఇలా అభినందన్ పాక్ ఆర్మీ అధికారులు విచారిస్తున్న వీడియో బాగా పాపులర్ అయ్యింది.  అయితే దీన్ని ప్రపంచ కప్ లో ఇండో పాక్ మ్యాచ్ తో జతచేసి ఓ టీవి ఛానల్ యాడ్ ను రూపొందించింది. అభినందన్ మీసకట్టును కలిగి టీమిండియా జెర్సీ ధరించిన ఓ నటుడిపై ప్రపంచ కప్ గురించి ప్రశ్నించడమే ఈ యాడ్ కాన్సెప్ట్.   ఇండియా టాస్ గెలిస్తే ఏం చేస్తుందని వారు ప్రశ్నించగా సారీ...నేనేమి చెప్పకూడదంటూ అతడు సమాధానం చెబుతాడు. ఇలా అతడు టీ తాగుతూనే రెండు మూడు ప్రశ్నలకు సేమ్ సమాధానం చెబుతాడు. 

అయితే చివర్లో టీ కప్పును తీసుకుని వెళ్లిపోతుండగా వెనక్కి పిలిచి క ప్ ఎక్కడికి తీసుకెళుతున్నావ్ అని అడుగుతారు. అంటే టీ కప్పును  ప్రపంచ కప్ తో పోల్చారన్నమాట. అతడి వద్ద నుండి టీ కప్పును లాక్కుంటారు. అంటే దీనర్థం ఇండియా నుండి  పాక్ ప్రపంచ కప్ లాక్కుంటుందని ఈ యాడ్ సారాంశం. అయితే ఈ యాడ్ ను క్రియేటివ్ కోణంలో చూసినప్పటికి సేమ్ అభినందన్ వేషధారణలో అదీ ఇండియన్ జెర్సీని వేసి అవమానించే చిత్రీకరించడం భారత అభిమానులకు నచ్చడం లేదు. దీంతో ఈ యాడ్ ను రూపొందించిన టీవి ఛానల్ పై వారు సోషల్ మీడియా వేదికన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios