Asianet News TeluguAsianet News Telugu

పాక్‌కు తొలి మూడు మ్యాచ్‌లు 1992లాగే: కప్ మాదేనంటున్న అభిమానులు

1992లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను పునరావృతం చేయనుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఇందుకు కారణాలు కూడా వినిపిస్తున్నారు

will Pakistan transformed 1992 World Cup victory
Author
London, First Published Jun 9, 2019, 1:47 PM IST

ఎప్పుడెలా ఆడుతోందో తెలియని జట్టు పాకిస్తాన్. ప్రపంచంలోని అన్ని జట్ల ఆటతీరును అంచనా వేయగలిగే క్రీడా విశ్లేషకులు .. పాక్‌ విషయంలో మాత్రం బొక్కబొర్లాపడుతుంటారు. తాజా ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన ఆ జట్టు.. టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్‌‌కు షాకిచ్చింది.

దీంతో పాక్ జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 1992లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను పునరావృతం చేయనుందని వారు బలంగా నమ్ముతున్నారు.

ఇందుకు కారణాలు కూడా వినిపిస్తున్నారు. సర్ఫరాజ్ నేతృత్వంలోని పాక్ జట్టు ఈ ప్రపంచకప్‌లో మంచి ఆరంభాన్ని సంపాదించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో విండీస్ చేతిలో ఘోర పరాజయం తర్వాత రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది.

తదుపరి శ్రీలంకతో ఆడాల్సిన మూడో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. కాగా 1992లోనూ పాక్‌కు ఇదే రకమైన పరిస్ధితి కనిపించింది. ఆ టోర్నీని కూడా రౌండ్ రాబిన్ పద్దతిలోనే ప్రవేశపెట్టారు. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తోనే తలపడిన పాక్.. పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

అనంతరం రెండో మ్యాచ్‌లో జింబాబ్వేతో గెలిచింది. ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. ఆ తర్వాత వరుస పెట్టి మ్యాచ్‌లు గెలుస్తూ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. అప్పటి పరిస్ధితులే ఇప్పుడు కూడా కనిపిస్తుండటంతో మరోసారి తమ జట్టు ప్రపంచకప్‌ను గెలుస్తుందని పాకిస్తాన్ అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios