Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup 2024: ఆల్‌రౌండర్లకు చోటు..  శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే! 

T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC) తమ జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పటిష్ఠమైన జట్టును ఈ టోర్నీకి ఎంపిక చేసింది. ఈ జట్టులో ఎవరెవరికి చోటుదక్కిందో తెలుసా? 

Sri Lanka Announce Squad For T20 World Cup 2024 Wanindu Hasaranga Lead Team KRJ
Author
First Published May 9, 2024, 8:59 PM IST

T20 World Cup 2024: వచ్చే నెలలో అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC) తమ జట్టును ప్రకటించింది. ఈ పొట్టి ఫార్మట్ కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక బోర్డు  ప్రకటించింది. ఈ గ్లోబల్ టోర్నీలో శ్రీలంక జట్టు వనిందు హసరంగ కెప్టెన్సీలో ఆడనుంది. వాస్తవానికి గాయం కారణంగా హసరంగ IPL 2024 సీజన్‌కు దూరమయ్యాడు. ఇటీవల కోలుకున్న హసరంగా శ్రీలంకలో జరిగిన T20 ప్రాక్టీస్ మ్యాచ్ నుండి తిరిగి వచ్చాడు.  జట్టు నిండా ఆల్‌రౌండర్లతో శ్రీలంక జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఇక మాజీ పరిమిత ఓవర్ల కెప్టెన్ దసున్ షనకతో పాటు కుసాల్ మెండిస్, ధనంజయ డి సిల్వా జట్టులో చోటు కల్పించారు.  

గ్రూప్-డిలో శ్రీలంక 

బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా తోపాటు శ్రీలంక జట్టు గ్రూప్ D లో చేర్చబడింది. జూన్ 3న న్యూయార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో శ్రీలంక జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత జూన్ 8న డల్లాస్‌లో బంగ్లాదేశ్‌తో జట్టు ఆడనుంది. గ్రూప్ దశలోని చివరి రెండు మ్యాచ్‌ల్లో జూన్ 12న ఫ్లోరిడాలో నేపాల్‌తో, జూన్ 17న సెయింట్ లూసియాలో నెదర్లాండ్స్‌తో శ్రీలంక తలపడనుంది.

పతిరనా IPLలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడుతున్నాడు. కానీ అతను ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో గాయపడి టోర్నమెంట్ నుండి వైదొలిగాడు. గాయం కారణంగా పతిరనా తిరిగి కొలంబో చేరుకున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడిన అతను 13 వికెట్లు తీశాడు. ఇక ఈ జట్టులో సీనియర్ బ్యాటర్  ఏంజెలో మాథ్యూస్‌ కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.  

శ్రీలంక జట్టు ఇలా...

వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ్ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దునిత్ వెలలాగే, దుష్మంత చమీరనా,  మతీషా పతిరణ, నువాన్ తుషార, దిల్షన్ మదుశంక.

ట్రావెలింగ్ రిజర్వ్‌లు: అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుక రాజపక్సే, జనిత్ లియానాగే.
 

Follow Us:
Download App:
  • android
  • ios