Asianet News TeluguAsianet News Telugu

RCB vs LSG : మ‌యాంక్ యాద‌వ్ విధ్వంసం.. త‌న రికార్డును తానే బ్రేక్ చేశాడు.. !

RCB vs LSG : మయాంక్ యాదవ్ పేస్ బౌలింగ్ విధ్వంసం కొనసాగుతోంది. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యంగ్ ప్లేయ‌ర్.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పై కూడా తుఫాను ప్రదర్శనతో ఆట‌గాళ్ల‌ను హ‌డ‌లెత్తించాడు. 
 

RCB vs LSG : Mayank Yadav's destruction.. He broke his own record by throwing the fastest ball in IPL 2024 RMA
Author
First Published Apr 3, 2024, 1:43 AM IST

RCB vs LSG - IPL 2024 : 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని ఓడించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో సొంతగడ్డపై ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మరోవైపు లక్నో జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిండ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో కూడా మ‌యాంక్ అగ‌ర్వాల్ బౌలింగ్ విధ్వంసం కొన‌సాగింది. త‌న రికార్డును తానే బ‌ద్ద‌లు కొట్టాడు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

లక్నో సూపర్ జెయింట్‌కు పేస్ బౌల‌ర్ మయాంక్ యాదవ్ త‌న బౌలింగ్ వేగంతో విధ్వంసం కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సూప‌ర్ బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తుఫాన్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. ల‌క్నోకు విక్ట‌రీని అందించాడు. దాదాపు 150 స‌గ‌టుతో స్థిరంగా బౌలింగ్ వేస్తూ ఆట‌గాళ్ల‌ను హ‌డ‌లెత్తిస్తున్నాడు. మయాంక్ ఐపీఎల్ 2024లో ఆర్సీబీపై వేగవంతమైన బంతిని వేశాడు. తన రికార్డును తానే బ‌ద్ద‌లుకొడుతూ రికార్డును మెరుగుపరుచుకున్నాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ నాలుగు ఓవ‌ర్లు వేసిన‌ మయాంక్ 14 ప‌రుగులిచ్చి 3 వికెట్లు కూడా తీశాడు.

ఐపీఎల్ 2024లో అత్యంత వేగ‌వంత‌మైన బౌలింగ్.. 

ఆర్సీబీపై గంటకు 156.7 కిమీ వేగంతో బంతిని బౌలింగ్ చేయడం ద్వారా మయాంక్ ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన త‌న రికార్డును తానే బ‌ద్ద‌లుకొట్టాడు. అంత‌కుముందు, ఆర్సీబీపై పై గంటకు 155.8 కి.మీ వేగంతో బంతిని విసిరాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు గంటకు 155 కిమీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన బౌలర్‌గా మయాంక్ ఘ‌న‌త సాధించాడు. అతను 2 మ్యాచ్‌ల్లో 3 సార్లు ఇలా చేశాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత వేగ‌వంత‌మైన బంతులు విసిరిన టాప్-5 బౌల‌ర్ల‌లో మ‌యాంక్ చోటుద‌క్కించుకున్నాడు. అత‌ను నాలుగో స్థానంలో ఉండ‌గా, షాన్ టెయిట్ తొలి స్థానంలో ఉన్నాడు.

మ్యాక్స్‌వెల్‌, కామెరాన్ గ్రీన్‌ల వికెట్లు ఎగిరిప‌డ్డాయి..

మయాంక్ తొలుత గ్లెన్ మాక్స్‌వెల్‌ను అవుట్ చేశాడు. నికోలస్ పూరన్ చేతిలో మ్యాక్స్‌వెల్ క్యాచ్ అందుకున్నాడు. మ్యాక్స్‌వెల్ 2 బంతుల్లో కూడా స్కోర్ చేయలేకపోయాడు. దీని తర్వాత అతను కామెరూన్ గ్రీన్‌ని ఔట్ చేశాడు. మయాంక్ వేసిన బంతి స్పీడ్‌తో అత‌న్ని తప్పించుకుని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మయాంక్ బౌలింగ్ లోనే దేవదత్ పడిక్కల్ చేతిలో రజత్ పాటిదార్ క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.

అందుకే ఓడిపోతున్నాం.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైర‌ల్ !

 

 

RCB VS LSG HIGHLIGHTS : హోమ్‌గ్రౌండ్‌లో ఆర్సీబీకి వరుసగా రెండో ఓటమి.. నిప్పులు చెరిగిన మ‌యాంక్ యాద‌వ్ 

Follow Us:
Download App:
  • android
  • ios