Asianet News TeluguAsianet News Telugu

MI vs CSK Highlights : ధోని కొట్టిన పరుగులే గెలిపించాయి.. సెంచ‌రీ కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. దెబ్బకొట్టిన పతిరనా

Rohit Sharma : చెన్నైతో జ‌రిగిన మ్యాచ్ లో ముంబై జ‌ట్టు ఓడిపోయినా హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ 2024లో సెంచ‌రీ కొట్టాడు. ధోని ధనాధన్ ఇన్నింగ్స్, మతీషా పతిరనా అద్భుతమైన బౌలింగ్ తో ముంబై పై చెన్నై గెలిచింది. 
 

MI vs CSK Highlights: MS Dhoni's runs have won the match. Rohit Sharma hits a century; Matheesha Pathirana hits Mumbai RMA
Author
First Published Apr 15, 2024, 12:29 AM IST

MI vs CSK Highlights:  వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. గ‌త మ్యాచ్ ఓట‌మికి ముంబై పై ప్ర‌తీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ సూప‌ర్ ఇన్నింగ్స్ తో సెంచ‌రీ కొట్టాడు. త‌న టీ20 కెరీర్ లో మ‌రో మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో ముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 206 ప‌రుగులు చేసింది. 

ధోని మెరుపులు.. 

ఓపెనర్లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు కానీ, వీరు ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 69 పరుగుల తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. మరో ఎండ్ లో చివరి వరకు క్రీజులో ఉన్న శివం దూబే 66 పరుగుల తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. చివరలో ధోని మెరుపులు మెరిపించాడు. వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లతో తన బ్యాట్ పవర్ ను చూపిస్తూ దుమ్మురేపాడు ధోని కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు సాధించాడు.

అయ్యే రోహిత్ శ‌ర్మ‌.. క్యాచ్ ప‌ట్టబోతే ప్యాంట్ జారిపాయే.. ఏం చేసేది.. ! వీడియో

రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. 

207 భారీ పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైకి మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇద్దరు పవర్ ప్లే లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం అందించారు. ఇషాన్ కిషన్ 23 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ 31 పరుగుల చేసి పెవిలియన్ కు చేరాడు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణఇంచలేక వరుసగా పెవిలియన్ కు చేరుతున్న క్రమంలో మరో ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. దుమ్మురేపే షాట్స్ ఆడాడు. క్రమంలోనే ఈ  సీజన్ లో తన తొలి సెంచరీని నమోదుచేశాడు రోహిత్ శర్మ. 63 బంతుల్లో 166.67 స్ట్రైక్ రేటుతో 105 పరుగులు కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

 

ముంబై కొంపముంచిన మతీషా పతిరనా

ముంబై ఓటమిని శాసించింది యంగ్ బౌలర్ మతీషా పతిరనా. తన అద్భుతమైన బౌలింగ్ తో కీలకమైన 4 వికెట్లు తీసుకున్నాడు. అవసరమైన సమయంలో వికెట్లు తీసుకుని ముంబైని దెబ్బకొట్టాడు. తాను వేసిన 4 ఓవర్లలో 7 ఎకానమీ రేటుతో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. జోరుమీదున్న ఇషాన్ కిషన్ ను తన తొలి ఓవర్ లోనే ఔట్ చేశాడు. అదే ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ ను కూడా పెవిలియన్ కు చేర్చాడు. మంచి జోష్ లో కనిపించిన తిలక్ వర్మ వికెట్ తో పాటు రొమారియో షెపర్డ్ ల వికెట్లు తీసుకున్నాడు.


 

 

ధోని సిక్స‌ర్ల సునామీ.. ఉన్నంత సేపు దుమ్మురేపాడు ! ఏం ఆట బాసు అదిరిపోయింది

Follow Us:
Download App:
  • android
  • ios