Asianet News TeluguAsianet News Telugu

ఎవ‌రీ మ‌యాంక్ యాదవ్? ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఎల్ఎస్జీ పేసర్

LSG vs PBKS: పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ యంగ్ ప్లేయ‌ర్, పెస‌ర్ మ‌యాంక్ యాద‌వ్ త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో మ్యాచ్ ను ల‌క్నో వైపు తిప్పాడు. ఐపీఎల్ లో అత్యంత వేగ‌వంతమైన బంతిని విసిరి చ‌రిత్ర సృష్టించాడు. 
 

LSG vs PBKS: Who is Mayank Yadav? The LSG pacer bowled the fastest ball in the IPL at 155.8kmph RMA
Author
First Published Mar 30, 2024, 11:30 PM IST

LSG vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 11వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎక్నా స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో ప్లేయ‌ర్లు ధ‌నాధన్ ఇన్నింగ్స్ తో 199 పరుగుల చేశారు. లక్నో ప్లేయ‌ర్ల‌లో క్వింటన్‌ డి కాక్ (54), నికోలస్‌ పూరన్ (42), కృనాల్ పాండ్యా (43) లు బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టారు.

ఇక 200 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఓపెన‌ర్లు మంచి శుభారంభం అందించారు. 100 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించారు. పంజాబ్ వైపు మ్యాచ్ గెలుపు క‌నిపించిన స‌మ‌యంలో.. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ ప్లేయ‌ర్ మ‌యాంక్ యాద‌వ్ త‌న బౌలింగ్ మాయ‌తో పంజాబ్ ఆట‌గాళ్ల‌ను దెబ్బ‌తీశాడు. బుల్లెట్ల లాంటి బంతులు విసురుతూ మ్యాచ్ ను ల‌క్నో వైపు తిప్పాడు. ఐపీఎల్ 2024లో అత్యంత వేగమంత‌మైన బంతుల‌ను విసిరి చ‌రిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ లో ఆర్సీబీ సిక్స‌ర్ల మోత‌.. స‌రికొత్త రికార్డు !

ఈ మ్యాచ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్ పేసర్ మయాంక్ యాదవ్ తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. మ్యాచ్ సమయంలో, మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024 లో వేగవంతమైన బంతిని బౌల్ చేశాడు. 12వ ఓవర్ మొదటి బంతికి 155.8 కి.మీ. బంతిని విసిరాడు. కీల‌క‌మైన‌ జానీ బెయిర్‌స్టో ఔట్ చేసి ఐపీఎల్ లో త‌న తొలి వికెట్ ను తీసుకున్నాడు. అలాగే, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను ఇబ్బంది పెట్టడంతో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వికెట్ కూడా తీశాడు. మయాంక్ జితేష్ శర్మను కూడా పెవిలియ‌న్ కు పంపి లక్నో వైపు మ్యాచ్ ను తిప్పాడు. మ‌యాంక్ యాద‌వ్ 4 ఓవ‌ర్ల బౌలింగ్ వేసి 27 పరుగులు ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు తీసుకున్నాడు.

మయాంక్ యాదవ్ ఎవరు?

మయాంక్ యాదవ్ దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ టీమ్ తరఫున ఆడుతున్నాడు. 21 సంవత్సరాల ఈ యంగ్ ప్లేయ‌ర్ జూన్ 17, 2002 న జన్మించాడు. ఢిల్లీ తరపున అన్ని ఫార్మాట్లలో ఆడాడు. మంచి పేసర్‌గా గుర్తింపు సాధించాడు. దీంతో అత‌న్ని లక్నో సూపర్ జెయింట్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. మ‌యాంక్ యాద‌వ్ ఇటీవల దేవధర్ ట్రోఫీలో అద్భుత‌మైన బౌలింగ్ తో 12 వికెట్లు తీశాడు. దీని త‌ర్వాత 2022లో ల‌క్నో జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2023లో గాయం కారణంగా మయాంక్ యాద‌వ్ ఐపీఎల్ లో ఆడ‌లేక‌పోయాడు. అతని స్థానంలో అర్పిత్ గులేరియాను తీసుకున్నారు. అయితే ఈ ఎడిషన్ కోసం మళ్లీ వేలంలో అతన్ని కొనుగోలు చేయడంతో అతను ల‌క్నో టీమ్ లోకి వ‌చ్చాడు.

దంచికొట్టిన ల‌క్నో.. డీకాక్, పూరన్, కృనాల్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్..

 

Follow Us:
Download App:
  • android
  • ios