Asianet News TeluguAsianet News Telugu

ఆర్సీబీని దెబ్బ‌కొట్టి చ‌రిత్ర సృష్టించిన బుమ్రా..

Jasprit Bumrah : ఐపీఎల్ 2024లో భాగంగా 25వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో ఇరు జ‌ట్ల బౌల‌ర్ల‌లు భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించాకున్నారు. అయితే, బుమ్రా మాత్రం అద్భుత బౌలింగ్ తో 5 వికెట్లు తీసుకున్నాడు. 
 

Jasprit Bumrah became the first player to take 5 wickets against RCB IPL 2024 RMA
Author
First Published Apr 12, 2024, 12:21 AM IST

Jasprit Bumrah : వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ 2024 25వ లీగ్ మ్యాచ్ జ‌రిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ, పాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ కేవ‌లం 3 పరుగులు చేసి జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీని అవుట్ చేయడం ఇది 5వ సారి. ఆ తర్వాత అరంగేట్రం ఆటగాడు విల్ జాక్స్ 8 పరుగులకే వెనుదిరిగాడు. రజత్ పాటిదార్ కెప్టెన్ డుప్లెసిస్ తో క‌లిసి ఆర్స‌బీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలోనే పాటిదార్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి గెరాల్డ్ కోయెట్జీ చేతిలో ఔటయ్యాడు. అతని తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. డుప్లెసిస్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు.

మహిపాల్ లోమ్రార్ 0, వైషాక్ విజయకుమార్ 0, సౌరవ్ చౌహాన్ 9 తక్కువ పరుగులకే వరుసగా ఔటయ్యారు. చివరి వరకు దూకుడుగా ఆడిన దినేష్ కార్తీక్ 22 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 196 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇషాన్ కిషన్ (69 పరుగులు), సూర్య కుమార్ యాదవ్ (52 పరుగులు) దండయాత్ర, రోహిత్ శర్మ (32 పరుగులు), హార్దిక్ పాండ్యా (21 పరుగులు)ల ధనాధన్  ఇన్నింగ్స్ తో ముంబై 16వ ఓవర్ లోనే విజయాన్ని అందుకుంది. 

MI VS RCB HIGHLIGHTS : దండయాత్ర.. ఆర్సీబీకి చుక్క‌లు చూపిస్తూ ఇర‌గ‌దీశారు.. ముంబైకి వ‌రుస‌గా రెండో గెలుపు

బౌలింగ్ విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా మ‌రోసారి అద‌ర‌గొట్టాడు. ఈ మ్యాచ్ లో ఇత‌ర బౌల‌ర్లు భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటే బుమ్రా మాత్రం ఏకంగా  5 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఆర్సీబీపై 5 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. బుమ్రా 4 ఓవర్లు వేసి 21 పరుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.ఇంతకు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టు కోచ్‌గా ఉన్న ఆశిష్ నెహ్రా చెన్నై జట్టులో ఆడినప్పుడు ఆర్సీబీ జట్టుపై అత్యధికంగా 4/10 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. ఈ రికార్డును ఇప్పుడు బుమ్రా బద్దలు కొట్టాడు. అంతే కాకుండా ఐపీఎల్ క్రికెట్‌లో 2వ సారి 5 వికెట్లు తీసిన ఘ‌త‌న సాధించాడు.

 

అంతకుముందు బుమ్రా 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ సిరీస్‌లో 5/10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అయితే ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. జేమ్స్ బాచ్నర్, జయదేవ్ ఉనత్‌గట్, భువనేశ్వర్ కుమార్ లు రెండు సార్లు 5 వికెట్లు తీసిన జాబితాలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 3వ ఓవర్ వేసిన బుమ్రా ఆ తర్వాత 11వ ఓవర్ బౌల్ చేశాడు. మళ్లీ 17వ ఓవర్‌ వేశాడు. ఈ ఓవర్లో బాబ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రార్ వికెట్లు తీశారు. చివరకు 19వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో సౌరవ్ చౌహాన్, వైశాక్ విజయకుమార్ వికెట్లు తీశారు. గెరాల్డ్ గాడ్సే, ఆకాష్ మద్వాల్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

డీకే దుమ్మురేపాడు.. ఏమ‌న్న బ్యాటింగ్ గా ఇది దినేష్ కార్తీక్..

Follow Us:
Download App:
  • android
  • ios