Asianet News TeluguAsianet News Telugu

జోరు మీదున్న విరాట్ కోహ్లీ...కెప్టెన్ గా మరో రికార్డు

కెప్టెన్ గా టెస్టు మ్యాచుల్లో 19 సెంచరీలు చేశాడు. మొత్తంగా టీం ఇండియా కెప్టెన్ గా అన్నీ అంతర్జాతీయ మ్యాచుల్లో 40 సెంచరీలు చేశాడు. ఈ ఘనత సాధించిన ఇండియన్ క్రికెటర్ కోహ్లీ ఒక్కడే. కాగా... 2014లో విరాట్... టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ నుంచి స్వీకరించిన సంగతి తెలిసిందే.

India vs South Africa: Virat Kohli first Indian to score 40 international centuries as captain
Author
Hyderabad, First Published Oct 11, 2019, 12:42 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి జోరు మీద ఉన్నారు. వరల్డ్ కప్ లో సక్సెస్ కాలేకపోయినా... ఆ తర్వాతి అన్ని సిరీస్ లో దుమ్ము రేపుతున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సొంత గడ్డపై టెస్టు మ్యాచ్ కోసం తలపడుతున్నారు. కాగా... ఈ టెస్టు సిరీస్ లో కోహ్లీ... సరికొత్త రికార్డును సృష్టించాడు.  పూణే వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేయగా.. ఆ సెంచరీతో ఓ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 

కేవలం అంతర్జాతీయ టెస్టు మ్యాచుల్లో కోహ్లీ 26 సెంచరీలు చేయడం విశేషం. కాగా... పాక్ క్రికెటర్ ఇంజిమామ్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇంజిమామ్.. 120 టెస్టు మ్యాచుల్లో 25 సెంచరీలు చేయగా... విరాట్ కోహ్లీ కేవలం 81 టెస్టు మ్యాచుల్లోనే 26 సెంచరీలు చేయడం గమనార్హం.

అంతేకాకుండా కెప్టెన్ గా టెస్టు మ్యాచుల్లో 19 సెంచరీలు చేశాడు. మొత్తంగా టీం ఇండియా కెప్టెన్ గా అన్నీ అంతర్జాతీయ మ్యాచుల్లో 40 సెంచరీలు చేశాడు. ఈ ఘనత సాధించిన ఇండియన్ క్రికెటర్ కోహ్లీ ఒక్కడే. కాగా... 2014లో విరాట్... టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ నుంచి స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఇక  ఇతర దేశాల క్రికెటర్లను చూస్తే...  రీకీ పాంటింగ్( ఆస్ట్రేలియా) కూడా 19 సెంచరీలు చేశాడు. తాజా సెంచరీతో కోహ్లీ.. రీకీ పాంటింగ్ కి సమమయ్యాడు.   టెస్టుల్లో కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మన్ గా  దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 శతకాలతో తొలి స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. 

టెస్టుల్లో అత్యంత తక్కువ  ఇన్నింగ్స్ లో 26 సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ కేవలం 138 ఇన్నింగ్స్ లో ఈ మైలు రాయు చేరుకోగా.. రికార్డ్ లో డాన్ బ్రాడ్ మన్ 69 ఇన్నింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మూడో స్థానంలో సచిన్ టెండుల్కర్, ఐదో స్థానంలో సునీల్ గవాస్కర్, ఆరో స్థానంలో మాథ్యూ హెడెన్ ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios