Asianet News TeluguAsianet News Telugu

నిషేధకాలంలో నేను అందుకోసమే కష్టపడ్డా... : వార్నర్

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా సంవత్సరం పాటు నిషేధాన్ని ఎదుర్కొన్ని తాజాగా ఐపిఎల్ 2019 ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేశాడు ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఓపెనర్ గా వార్నర్ బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. నిషేధంతోనే వార్నర్ కెరీర్ ముగిసిందన్న విమర్శకుల నోళ్లను తన బ్యాటింగ్ తోనే మూయించాడు.తన ఐపిఎల్ ప్రదర్శనతో ఆసిస్ సెలెక్టర్ల దృష్టిని కూడి ఆకర్షించి ప్రపంచ కప్ ఆడే ఆసిస్ జట్టుతో కూడా వార్నర్ చోటు దక్కించుకున్నాడు. అయితే ఇలా నిషేధం తర్వాత అత్యుత్తమంగా ఆకట్టుకోడానికి గల కారణాలను తాజాగా వార్నర్ బయటపెట్టాడు. 

I just worked hard on being the best father and husband: warner
Author
Hyderabad, First Published Apr 30, 2019, 3:15 PM IST

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా సంవత్సరం పాటు నిషేధాన్ని ఎదుర్కొన్ని తాజాగా ఐపిఎల్ 2019 ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేశాడు ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఓపెనర్ గా వార్నర్ బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. నిషేధంతోనే వార్నర్ కెరీర్ ముగిసిందన్న విమర్శకుల నోళ్లను తన బ్యాటింగ్ తోనే మూయించాడు.తన ఐపిఎల్ ప్రదర్శనతో ఆసిస్ సెలెక్టర్ల దృష్టిని కూడి ఆకర్షించి ప్రపంచ కప్ ఆడే ఆసిస్ జట్టుతో కూడా వార్నర్ చోటు దక్కించుకున్నాడు. అయితే ఇలా నిషేధం తర్వాత అత్యుత్తమంగా ఆకట్టుకోడానికి గల కారణాలను తాజాగా వార్నర్ బయటపెట్టాడు. 

అంతర్జాతీయ క్రికెట్ నుండి నిషేధాన్ని ఎదుర్కొన్న సంవత్సరకాలంలో మొదటి 16-18 వారాలు కేవలం తన కుటుంబానికే పరిమితమయ్యానని వార్నర్ తెలిపాడు. అంతకుముందు తానే క్రికెట్ల్ కే ఎక్కువ సమయం కేటాయించడంతో కుటుంబంతో ఎక్కువగా గడపలేకపోయేవాడినని...కానీ నిషేధంతో అందుకు చాలా సమయం దొరికిందన్నాడు. తాను ముఖ్యంగా తన భార్యకు మంచి భర్తగా, కూతురికి మంచి తండ్రిగా వుండాలని నిర్ణయించుకుని అందుకోసం చాలా కష్టపడ్డానని తెలిపాడు. ఆ సమయంలోనే ఒత్తడిని ఎలా అధిగమించాలో నేర్చకున్నానని వార్నర్ వెల్లడించాడు. 

అలా ఒత్తిడిని లెక్కచేయకపోవడం ఇప్పుడు ఐపిఎల్ లో ఎంతగానో ఉపయోగపడిందని అన్నాడు. క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ బ్యాటింగ్ చేయడం వల్లే ఈ సీజన్ లో సన్ రైజర్స్ తరపున, ఓవరాల్ గా ఐపిఎల్ లో టాప్ స్కోరర్ గా నిలవగలిగానని వెల్లడించాడు. నేను తమ జట్టులో అందరితో సరదాగా వుంటూ ఫన్నీ మ్యాన్ గా వున్నానని...ఒత్తిడిని ఎప్పుడూ తన దరికి చేరనివ్వలేదన్నారు. అదే తన బ్యాటింగ్ సీక్రెట్ అని వార్నర్ అన్నాడు. 

బాల్ టాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురైన వార్నర్, స్మిత్ లు గతేడాది ఐపిఎల్ ను మిస్సయ్యారు. వారిపై వున్న నిషేధం ముగియడంతో ఈ ఐపిఎల్ లో పునరాగమనం చేశారు. అయితే  మళ్లీ తమ కెరీర్ ప్రారంభించిన స్మిత్ ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయాడు. కానీ వార్నర్ మాత్రం సన్ రైజర్స్ తరపున అత్యుత్తమంగా ఆడుతూ 692 పరుగులను సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న నేపథ్యంలో సోమవారం చివరి ఐపిఎల్ మ్యాచ్ ఆడిన వార్నర్ హైదరాబాద్ ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు. 56 బంతుల్లోనే 81 పరుగులు చేసి మరోసారి సన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కీలక ఆటగాడు వార్నర్ జట్టుకు దూరమవుతుండటంతో హైదరాబాద్  అభిమానులను బాధిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios