Asianet News TeluguAsianet News Telugu

బూమ్ బూమ్ బూమ్రా.. కింగ్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్.. ! 5 వికెట్లతో అదరగొట్టాడు..

Virat kohli vs Jasprit Bumrah : ఐపీఎల్ 2024 లో ముంబైతో జ‌రిగిన మ్యాచ్ లో మ‌రోసారి బుమ్రా తన మాయాజాలంతో విరాట్ కోహ్లీతో మొదలు పెట్టి బెంగళూరుకు చెందిన కీలకమైన ఐదుగురు ప్లేయర్లను పెవిలియన్ కు పంపాడు. కింగ్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ తానేనంటూ మరోసారి నిరూపించాడు. 
 

Boom Boom Bumrah.. Jasprit Bumrah is the king of fast bowling, taking 5 wickets for the second time in the IPL  MI vs RCB RMA
Author
First Published Apr 11, 2024, 10:13 PM IST

Boom Boom Bumrah : ముంబైలోని వాంఖడే స్టేడియం బూమ్ బూమ్ బూమ్రా అంటూ హోరెత్తింది. త‌న అద్భుత‌మైన యార్క‌ర్ బౌలింగ్ తో కింగ్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ గా నిలిచాడు. ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్ ల‌ను గెలిపించిన ఈ ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ ఐపీఎల్ 2024 లో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో బెంగ‌ళూరు వైపు మ్యాచ్ వెళ్తున్న స‌మ‌యంలో ముంబై వైపు తీసుకువ‌చ్చాడు. త‌న ఓవ‌ర్ వేసిన‌ప్పుడ‌ల్లా అద్భుత‌మైన బౌలింగ్ తో ఆర్సీబీని దెబ్బ‌కొట్టాడు. విరాట్ కోహ్లీతో పాటు కీల‌క‌మైన ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీని దెబ్బ‌కొట్టాడు. ఈ సీజ‌న్ లో ప‌ర్పుల్ క్యాప్ ను అందుకున్నాడు. ఈ సీజ‌న్ లో లీడిండ్ వికెట్ టేక‌ర్ గా కొన‌సాగుతున్నాడు.

ఐపీఎల్ 2024 లో 25వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్-రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన బెంగ‌ళూరు మంచి స్కోర్ అందించారు ఆర్సీబీ ప్లేయ‌ర్లు అయితే, భారీ స్కోర్ దిశ‌గా ముందుకు సాగుతూ మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వెళ్తున్న స‌మ‌యంలో బుమ్రా త‌న బౌలింగ్ మాయ‌తో ముంబైని ముందుంచాడు. మ‌రో బౌల‌ర్ రాగానే మ‌ళ్లీ మ్యాచ్ ఆర్సీబీ వైపు.. కెప్టెన్ మ‌ళ్లీ బుమ్రాను రంగంలోకి దింప‌డం క‌నిపించింది. ఇలా బుమ్రా వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వికెట్లు తీసుకుంటూ అద‌ర‌గొట్టాడు. ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌ను వ‌రుస‌గా పెవిలియ‌న్ వైపు న‌డిపించాడు.

IPL 2024 : బుర్ర పెట్టాడు క్యాచ్ పట్టాడు.. యాక్షన్ అదిరిపోయింది.. !

ఈ మ్యాచ్ లో మొద‌ట విరాట్ కోహ్లీ వికెట్ తో వికెట్ల వేట మొద‌లు పెట్టిన బుమ్రా.. అద్భుత‌మైన యార్క‌ర్లు వేస్తూ ఆర్సీబీకి చెందిన కీల‌క‌మైన 5 వికెట్లు తీసుకున్నాడు. త‌న తొలి ఓవ‌ర్ లో విరాట్ కోహ్లీని దెబ్బ‌కొట్టిన బుమ్రా.. త‌ర్వాతి ఓవ‌ర్ లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న కెప్టెప్ ఫాఫ్ డుప్లెసిస్ ను పెవిలియ‌న్ కు పంపాడు. అదే ఓవ‌ర్ లో లోమ్రోర్ ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత సౌరవ్ చౌహాన్, విజ‌య్ కుమార్ ను ఔట్ చేసి త‌న బౌలింగ్ ప‌దును రుచిచూపించాడు. ఫాస్ట్ బౌలింగ్ కింగ్ నంటూ స‌త్తా చాటాడు. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసుకోవ‌డంతో బూమ్రా ప‌ర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు బుమ్రా రెండు సార్లు ఐపీఎల్ లో 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో చివ‌ర‌లో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించ‌డంతో ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 196/8 ప‌రుగులు చేసింది బెంగ‌ళూరు.

 

ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ తో మ‌రో ఛాంపియ‌న్ ఢీ.. బుమ్రా ముందు కోహ్లీ.. ! 

Follow Us:
Download App:
  • android
  • ios