Asianet News TeluguAsianet News Telugu

సేఫ్ చేసిన ఫెస్టివ్ సీజన్.. రికార్డు స్థాయిలో సేల్స్

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ కియా మోటార్స్ గత నెలలో విపణిలో ఆవిష్కరించిన సెల్టోస్ మోడల్ కారు రికార్డులు నెలకొల్పింది. రూ.9.69 లక్షల ధరకు అందుబాటులో ఉన్నఈ కారు.. ఇతర మోడల్ కార్లతో పోటీ పడుతుందనడంలో సందేహం లేదు.

Record 12800 Units of Kia Seltos SUV Sold in October, Their Highest Yet
Author
Hyderabad, First Published Nov 3, 2019, 10:53 AM IST

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, బీఎస్-6 ప్రమాణాలను అమలులోకి తేవాల్సిన పరిస్థితుల వల్ల 11 నెలలుగా ఆటోమొబైల్ విక్రయాలు పడిపోతున్నాయి. కానీ పండుగల సీజన్‌లో మాత్రం పలు ఆటోమొబైల్ సంస్థల విక్రయాల్లో మెరుగుదల నమోదైంది. 

ఎంజీ మోటార్స్, కియా మోటార్స్ మాత్రం అందుకు భిన్నంగా రికార్డు స్థాయి విక్రయాలు నమోదు చేశాయి. విపణిలోకి రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి స్ఫూర్తిదాయక విక్రయాలు సాగించాయి. 

కియా మోటార్స్ వారి సెల్టోస్ మోడల్ కారు 12,800 యూనిట్లు అమ్ముడు పోయాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే సేల్స్ గణనీయ స్థాయిలో కియా మోటార్స్ పెరిగాయి. భారతీయుల్లో ఎస్‌యూవీ మోడల్ కార్ల పట్ల ఆదరణ పెరుగుతోంది. దీని ధర రూ.9.69 లక్షలు పలుకుతోంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా స్ఫూర్తిదాయక కనెక్టివిటీ కల ఫీచర్లతో విపణిలోకి అడుగు పెట్టిన మోడల్ కారు సెల్టోస్. 

యూవీవో కనెక్ట్, కనెక్టెడ్ కారు టెక్నాలజీ, కన్వీనియెన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. యూవీవో కారులో నేవీగేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, వెహికల్ మేనేజ్మెంట్, రిమోట్ కంట్రోల్, కన్వీనియన్స్ వంటి 37 ఐదు డిస్టింక్ క్యాటగిరీలతో కూడిన స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ కమాండ్, స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్ అండ్ ఇమ్మోబిలైజేషన్, ఆటో కొల్లీషన్ నోటిఫికేషన్, ఎస్ఓఎస్- ఎమర్జెన్సీ అసిస్టెన్స్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్, రిమోట్లీ ఆపరేటెడ్ ఎయిర్ ఫ్యూరిఫయర్, ఇన్ కార్ ఎయిర్ క్వాలిటీ మానిటర్, సేఫ్టీ అలర్ట్ (జియో ఫెన్స్, టైం ఫెన్స్, స్పీడ్, వాలెట్, ఐడిల్) కూడా ఇందులో చేర్చారు.

కియా సెల్టోస్ రెండు ట్రిమ్స్ - జీటీ లైన్, టెక్ లైన్ మోడల్స్‌లో లభించనున్నది. మూడోతరం స్మార్ట్ స్ట్రీమ్ ఇంజిన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 1.5 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్, 1.4 లీటర్ల టర్బో పెట్రోల్ వేరియంట్లో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ తోపాటు 7డీసీటీ, ఐవీటీ, 6ఏటి మోడళ్ల (మూడో ఆటోమేటిక్ ఆప్షన్ల)లో ఇంజిన్లు రూపుదిద్దుకున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios