Asianet News TeluguAsianet News Telugu

రిస్క్ లేని పెట్టుబడి; ఈ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ ప్రభుత్వ రంగ  అండ్ ప్రైవేట్ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను చెక్  చేయడం ముఖ్యం. చాలా వరకు బ్యాంకుల వడ్డీ రేటు దాదాపు 6.8 నుంచి 7 శాతం ఉంటుంది.

risk-free Investment; These 3 banks will pay high interest rates check here for more info-sak
Author
First Published Mar 26, 2024, 3:56 PM IST

ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత సురక్షితమైన ఇంకా  హామీ ఇచ్చే రాబడిలో ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే ముందు, వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను తెలుసుకోవడం మంచిది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ ప్రభుత్వ రంగ  అండ్ ప్రైవేట్ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను చెక్  చేయడం ముఖ్యం. చాలా వరకు బ్యాంకుల వడ్డీ రేటు దాదాపు 6.8 నుంచి 7 శాతం ఉంటుంది.

ప్రముఖ బ్యాంకులలో HDFC బ్యాంక్ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు:
  ఒక సంవత్సరం డిపాజిట్‌పై, HDFC బ్యాంక్ సాధారణ పౌరులకు 6.60 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.10 శాతం వడ్డీని అందిస్తుంది. 15 నెలల నుంచి 18 నెలల కాలానికి వడ్డీ రేటు 7.10 శాతానికి పెరుగుతుంది. అదే 18-21 నెలల కాలపరిమితి  FDలపై వడ్డీ రేటు 7.25 శాతం. 21 నెలల నుండి 2 సంవత్సరాల 11 నెలల కాలానికి  వడ్డీ రేటు 7 శాతం.  2 సంవత్సరాల 11 నెలల నుండి 35 నెలలకు పెరిగినప్పుడు వడ్డీ రేటు 7.15 శాతం. కొత్త రేట్లు ఫిబ్రవరి 9 నుంచి అమల్లోకి వచ్చాయి.

ICICI బ్యాంక్:  ICICI బ్యాంక్ ఒక సంవత్సరం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.40 శాతం వడ్డీని అందిస్తుంది. 390 రోజుల నుంచి 15 నెలలకు     7.30 శాతానికి తగ్గుతుంది. 15 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, బ్యాంక్ సంవత్సరానికి 7.05 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న FDలకు వడ్డీ రేటు 7 శాతం. కొత్త రేట్లు ఫిబ్రవరి 8, 2024 నుండి అమలులోకి వచ్చాయి.

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు 6.80 శాతం.   2-3 సంవత్సరాల కాలానికి వడ్డీ రేటు 7 శాతానికి పెరుగుతుంది. SBI అందించే వడ్డీ రేటు 3-5 సంవత్సరాల మధ్య ఉంటే 6.75 శాతం అలాగే    5 సంవత్సరాలు దాటినప్పుడు 6.5 శాతానికి తగ్గుతుంది. తాజా రేట్లు డిసెంబర్ 27, 2023 నుండి అమలులోకి వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios