Asianet News TeluguAsianet News Telugu

మార్చి 31 ఆదివారం అయినా కూడా బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే...?

2023 అండ్ 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన నగదు లావాదేవీలను పూర్తి చేయడానికి మార్చి 31ని వర్కింగ్  డేగా  మార్చారు. 

Banks will open on March 31, even though it's a Sunday, because know reason here-sak
Author
First Published Mar 22, 2024, 1:57 AM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించే అన్ని బ్యాంకులను మార్చి 31 ఆదివారం కూడా విధులు  నిర్వహించాలని ఆర్‌బిఐ ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఏజెన్సీ బ్యాంకులకు చెందిన బ్యాంకులకు ఈ ఆదేశం వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారం చివరి రోజు అయిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సూచన వచ్చింది.

2023 అండ్ 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన నగదు లావాదేవీలను పూర్తి చేయడానికి మార్చి 31ని వర్కింగ్  డేగా  మార్చారు. రిజర్వ్ బ్యాంక్ ఏజెన్సీ బ్యాంకులకు చెందిన ప్రభుత్వ అండ్  ప్రైవేట్ బ్యాంకులకు ఈ ఆదేశం వర్తిస్తుంది. ఈ బ్యాంకుల శాఖలను కూడా తెరవాలని ప్రతిపాదించారు. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, RBL బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, CSB బ్యాంక్ మొదలైనవి రిజర్వ్ బ్యాంక్ ఏజెన్సీ బ్యాంకులలో ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios