Asianet News TeluguAsianet News Telugu

India Open 2022: శ్రీకాంత్ కిదాంబి, అశ్విని పొన్నప్పలకు కరోనా పాజిటివ్..!

ఈ టోర్నీలో ఏడుగురు భారతీయ షట్లర్లు కరోనా బారిన పడ్డారు. వారిలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రితికా ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు

Top shuttlers Kidambi Srikanth and Ashwini Ponappa among 7 to test Covid-19 positive at India Open 2022
Author
Hyderabad, First Published Jan 13, 2022, 10:31 AM IST

 ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మెంటన్ టోర్నమెంట్ లో కరోనా కలకలం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో.. భారత షట్లర్లు కరోనా బారినపడ్డారు.

ఈ టోర్నీలో ఏడుగురు భారతీయ షట్లర్లు కరోనా బారిన పడ్డారు. వారిలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రితికా ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు. ఇదే విషయాన్ని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో ప్రకటించింది. 

"ఇండియా ఓపెన్ 2022 టోర్నీలో భాగంగా కొవిడ్ టెస్టులు నిర్వహించగా అందులో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. మంగళవారం వారికి నిర్వహించిన RT-PCR పరీక్షల్లో ఆటగాళ్లకు పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆ ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్న డబుల్స్ క్రీడాకారులు కూడా టోర్నీని విరమించుకున్నారు" అని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. 

కరోనా కేసులు నమోదైన కారణంగా ఇండియా ఓపెన్ 2022 నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన ఆటగాళ్లను ఐసోలేషన్ కు పంపడం సహా మిగిలిన ఆటగాళ్లకు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.  

 

కిదాంబి శ్రీకాంత్ ప్రస్తుతం బ్యాడ్మింటన్ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప ప్రపంచ ర్యాంకింగ్స్ లో నంబరు 20లో కొనసాగుతుంది. డబుల్స్ లో ఈమెకు జోడీగా సిక్కిరెడ్డి ఆడుతుంది. 

2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నీలో కాంస్య పతకాన్ని సాధించిన భారత షట్లర్ బి.సాయి ప్రణీత్ కూడా గతవారం కొవిడ్ బారిన పడ్డాడు. కరోనా సోకిన తర్వాత ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రణీత్ ప్రకటించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios