Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్‌లోకి యమహా సెల్యూటో ప్లస్ ఆర్‌ఎక్స్‌

యమహా మోటార్ ఇండియా మార్కెట్లోకి అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థ రెండు కొత్త మోటార్ బైక్ లను మార్కెట్లోకి విడుల చేసింది. యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ (యూబీఎస్) గల సెల్యూటో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నది. ఈ మోడల్ బైక్‌ సేఫ్టీ ప్రమాణాలతో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. 
 

Yamaha Updates Saluto 125, Saluto RX With UBS
Author
New Delhi, First Published Dec 14, 2018, 1:43 PM IST

న్యూఢిల్లీ: యమహా మోటార్ ఇండియా మార్కెట్లోకి అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థ రెండు కొత్త మోటార్ బైక్ లను మార్కెట్లోకి విడుల చేసింది. యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ (యూబీఎస్) గల సెల్యూటో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నది. ఈ మోడల్ బైక్‌ సేఫ్టీ ప్రమాణాలతో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. 

యమహా సెల్యూటో 125 సీసీ సామర్థ్యం గల మోడల్ బైక్ ధర రూ.61,500, సెల్యూటో ఆర్ఎక్స్ ధర రూ.52 వేలకే లభిస్తున్నాయి. పాత మోడల్ బైక్ ధరలతో పోలిస్తే సగటున రూ.4000 తేడా ఉంటుంది. అదనపు సేఫ్టీ కిట్ ధరలు రూ.5000 వరకు పెరిగాయి. మేట్ గ్రీన్ వేరియంట్ మోడల్ బైక్ కావాలంటే మరో రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. రెడ్, గ్రీన్, బ్లూ ధరల్లో ఈ బైక్ లు లభిస్తున్నాయి. నాన్ యూబీఎస్ మోడల్ బైక్ లను మార్కెట్ల నుంచి డిస్ కంటిన్యూ చేస్తోంది యమహా మోటార్స్ ఇండియా. 

యూబీఎస్‌ పరిజ్ఞానం బ్రేకింగ్‌ వ్యవస్థలో కొత్తదని, వెనక బ్రేక్‌ వినియోగించినపుడు, ముందు బ్రేక్‌ కూడా స్వల్పంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. వినియోగ దారులకు వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తేవడాన్ని కొనసాగిస్తామని యమహా మోటార్‌ ఇండియా గ్రూప్‌ కంపెనీల ఛైర్మన్‌ మోటోఫుమి షిటారా పేర్కొన్నారు. సెల్యూటో ఆర్ఎక్స్ మోడల్ బైక్.. హోండా డ్రీమ్ యుగ, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోడళ్లతో పోటీ పడనుండగా, సెల్యూటో 125.. హోండా సీబీ షైన్, బజాజ్ డిస్కవర్ 125 మోటారు సైకిళ్లను ఢీ కొట్టనున్నది. 

తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 2 కొత్త బైకులు 

ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.800 కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతోంది. తద్వారా ఏటా 9,50,000 మోటార్‌ సైకిళ్లను తయారు చేసే ఉద్దేశంలో ఉంది.. సంస్థకు తమిళనాడులో మూడు తయారీ కేంద్రాలు ఉన్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి 2 కొత్త బైకులను తెలుగు రాష్ట్రాల్లోకి విడుదల చేసిన సందర్భంగా సంస్థ ఇండియా బిజినెస్‌ హెడ్‌ షాజీ కోశి మాట్లాడుతూ కొత్త బైకులు రెండూ 650 సీసీ విభాగంలోనివేనని చెప్పారు.

రూ. 2.50 లక్షలకు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్‌ ఐఎన్‌టీ 650 మూడు మోడళ్లలో లభిస్తోంది. ధర రూ.2,50,000 నుంచి ప్రారంభమవుతోంది. కాంటినెంటల్‌ జీటీ 650 కూడా మూడు మోడళ్లలో లభిస్తోండగా.. ప్రారంభ ధర రూ.2,65,000. 250-750 సీసీ మోటార్‌ సైకిళ్ల విభాగంలో 91శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నామనీ, ఈ కొత్త బైకులతో ఈ వాటా మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు షాజీ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios