Asianet News TeluguAsianet News Telugu

లంబోర్ఘిని నుండి మరో సూపర్ కార్.. జస్ట్ నాలుగు సెకన్లలోపు 100 స్పీడ్.. ఫీచర్స్ వేరే లెవెల్..

లంబోర్ఘిని భారతదేశంలో ఉరుస్ ఎస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సూపర్ ఎస్‌యూవీని కంపెనీ ఏప్రిల్ 13న విడుదల చేయవచ్చు. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు అందించనున్నారు.

Lamborghini URUS S accelerates to 100 in less than four seconds, will be launched next month-sak
Author
First Published Mar 27, 2023, 5:37 PM IST

ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారత మార్కెట్లోకి కొత్త సూపర్ ఎస్‌యూవీ ఉరస్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సూపర్ ఎస్‌యూవీని కంపెనీ ఎప్పుడు లాంచ్ చేస్తుంది, ఫీచర్లు ఎలా ఉంటాయో  చూద్దాం..

త్వరలోనే విడుదల
లంబోర్ఘిని భారతదేశంలో ఉరుస్ ఎస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సూపర్ ఎస్‌యూవీని కంపెనీ ఏప్రిల్ 13న విడుదల చేయవచ్చు. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు అందించనున్నారు.

డిజైన్ ఎలా ఉంటుందంటే 
డిజైన్ పరంగా, ఉరుస్ పెర్ఫార్మంటే అండ్ ఉరస్ ఎస్ మధ్య పెద్ద తేడా ఉండదు. అయితే పాత ఉరుస్ కంటే మెరుగ్గా ఉంటుంది. దీని వీల్ డిజైన్ డిఫరెంట్ గా ఉండనుంది, ఇందులో కార్బన్ ఫైబర్ కూడా ఉపయోగించనున్నారు. Performanteతో పోలిస్తే Urus S తక్కువ గ్రిప్పీ టైర్‌లను పొందుతుంది ఇంకా 47 కిలోల వరకు ఎక్కువ బరువు ఉంటుంది.

ఇంజన్
లంబోర్ఘిని ఉరుస్ S కంపెనీ నుండి 3996 cc ఎనిమిది-సిలిండర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ ఇంజన్‌తో వస్తుంది. 656 బిహెచ్‌పి పవర్, 850 న్యూటన్ మీటర్ల టార్క్ అందిస్తుంది. ఈ SUV సున్నా నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకునేందుకు కేవలం 3.5 సెకన్లు పడుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 305 కిలోమీటర్ల వరకు కూడా వెళుతుంది. ఇంకా ఫోర్ వీల్ డ్రైవ్‌తో లిమిటెడ్ స్లిప్ సెంట్రల్ డిఫరెన్షియల్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది.

ఉరుస్ S కూడా సురక్షితమైనది
ఈ శక్తివంతమైన ఇంజన్ సూపర్ SUVలో కంపెనీ ఎన్నో సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఇందులో, డ్రైవర్ అర్బన్ రోడ్, హైవే అండ్ ఫుల్ ADAS ఆప్షన్స్ ఉన్న మూడు ADAS ఆప్షన్స్ పొందుతుంది. దీనితో పాటు, ఈ SUVకి యాంటీ తెఫ్ట్ అలారం నోటిఫికేషన్, వాలెట్ అలర్ట్, కర్ఫ్యూ అలర్ట్, స్పీడ్ అలర్ట్, జియోఫెన్సింగ్ అలర్ట్, ప్రైవేట్ ఎమర్జెన్సీ కాల్, ఆన్‌లైన్ రోడ్ అసిస్టెన్స్, స్టోలెన్ వెహికల్ లొకేటర్, లంబోర్ఘిని కనెక్ట్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.

ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే

ఈ సూపర్ SUVలో డ్రైవర్ మొత్తం ఆరు మోడ్‌లను పొందుతాడు. వీటిలో మూడు మోడ్‌లు ఆన్-రోడ్ కోసం ఉన్నాయి, మిగిలిన మూడు మోడ్‌లు ఆఫ్-రోడ్ కోసం ఉన్నాయి. డ్రైవర్ Strada, Corsa, Sport, Sabia, Terra అండ్ Nav మోడ్‌ల మధ్య ఎంచుకోవచ్చు. ఇంకా ఈ కారులో రెండు స్క్రీన్‌లు ఉంటాయి, వాటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అండ్ మరొక స్క్రీన్ లో AC, సీట్లు, టెంపరేచర్ కంట్రోల్ వంటి ఫీచర్స్ సెట్ చేయవచ్చు. అంతే కాకుండా ఆన్‌లైన్ స్మార్ట్ రూటింగ్, ట్రాఫిక్ లైట్ ఇన్ఫర్మేషన్, 3డి సిటీ వ్యూ, వ్యూ, కార్ ఫైండర్ వంటి ఫీచర్లు ఇందులో వస్తాయి.

ధర ఎంతంటే 
దీని ధరల గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, ఈ సూపర్ SUV పెర్ఫార్మంటే కంటే క్రింద ఉంటుంది.  దాని ధర కూడా పెర్ఫార్మీ కంటే తక్కువగా ఉంటుంది. అయితే భారత్‌లో దీని ధర దాదాపు మూడు కోట్ల ఉండవచ్చని అంచనా.

Follow Us:
Download App:
  • android
  • ios