Asianet News TeluguAsianet News Telugu

కియా సెల్టోస్‌ ఫేస్‌లిఫ్ట్.. సరికొత్త డిజైన్, కలర్, లేటెస్ట్ ఫీచర్లతో వచ్చేస్తోంది...

కంపెనీ కొత్త సెల్టోస్‌ని మొదట యుఎస్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో 1.6-లీటర్ T-GDI టర్బోచార్జ్డ్ ఇంజన్ ఇచ్చారు. ఈ ఇంజన్‌తో ఎస్‌యూ‌వి 195 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Kia introduced facelift Seltos, mid-size SUV improved with new design and features
Author
First Published Nov 21, 2022, 7:44 PM IST

దక్షిణ కొరియా కార్ కంపెనీ కియా అతి తక్కువ సమయంలో సెల్టోస్ ద్వారా భారతీయ మార్కెట్లో చాలా బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా  అమెరికాలో జరుగుతున్న ఆటో షోలో కంపెనీ  మిడ్-సైజ్ ఎస్‌యూ‌వి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. అయితే ఈ కొత్త సెల్టోస్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేసిందో తెలుసా...

ఇంజిన్ ఎలా ఉంటుందంటే 
కంపెనీ కొత్త సెల్టోస్‌ని మొదట యుఎస్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో 1.6-లీటర్ T-GDI టర్బోచార్జ్డ్ ఇంజన్ ఇచ్చారు. ఈ ఇంజన్‌తో ఎస్‌యూ‌వి 195 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లుక్ అండ్ ఫీచర్లు చూస్తే 
కొత్త సెల్టోస్‌కు సరికొత్త డిజైన్‌ అందించడానికి కంపెనీ ప్రయత్నించింది. ఇందుకోసం కొత్త సెల్టోస్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్ వంటి చాలా భాగాలలో కంపెనీ మార్పులు చేసింది. దీనితో పాటు కొత్త అల్లాయ్ వీల్స్, ఎస్‌యూ‌విలో కొత్త ప్లూటాన్ బ్లూ కలర్ కూడా ఇచ్చారు. ఎక్ట్సీరియర్ కాకుండా ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇచ్చారు. మీడియా నివేదికల ప్రకారం, సెల్టోస్ కొత్త X లైన్ వేరియంట్‌ను కూడా తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇండియన్ వెర్షన్‌
మీడియా నివేదికల ప్రకారం, అమెరికాలో ప్రవేశపెట్టిన సెల్టోస్ కొత్త వెర్షన్ చాలా ఫీచర్లు ఇండియాలో  కూడా తీసుకువచ్చు. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ను కంపెనీ వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో ప్రారంభించవచ్చు. ఇందులో అమెరికన్ సెల్టోస్ చాలా ఫీచర్లతో పాటు కొత్త డ్యాష్‌బోర్డ్, కొత్త స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మెరుగైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ADAS వంటి ఫీచర్లను ఇవ్వవచ్చు.

సెల్టోస్ మూడు సంవత్సరాల క్రితం ఇండియాలో ప్రారంభించారు. సెల్టోస్ విడుదలైనప్పటి నుండి మంచి ఆదరణ పొందింది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో సెల్టోస్ సేల్స్ చాలా వేగంగా ఉన్నాయి, ఇంకా కేవలం మూడు సంవత్సరాలలో మూడు లక్షల యూనిట్లను విక్రయించింది.

ధర ఎంతంటే 
భారతదేశంలో సెల్టోస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.59 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు HTE, HTK, HTK+, HTX, HTX+, GTX(O), GTX+ వేరియంట్‌లలో అందించబడుతుంది. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.99 లక్షలు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios